దిల్ మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఆమె ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటించిన ఒకే ఒక్క సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకొని హీరోయిన్స్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. మొదటి సినిమాతోనే తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మలు.. తర్వాత వరుస ఆఫ‌ర్‌లు అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్డంతో దూసుకుపోతున్నారు. అయితే ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్న.. అనూహ్యంగా నటనకు దూరమైన వారు ఉన్నారు. అలా ఒకటికి, రెండు సినిమాలతోనే ఇండస్ట్రీ నుంచి దూరమైన వారిలో హీరోయిన్ నేహ కూడా ఒకటి. ఈ పేరు చెప్తే జనాలకు అంతగా గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. సూపర్ హిట్ మూవీ దిల్‌లో నటించినా హీరోయిన్ అంటే మాత్రం టక్కన గుర్తుపట్టేస్తారు.

ఇక హీరో నితిన్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ సినిమాగా నిలిచిన దిల్ సినిమాలో హీరోయిన్గా నేహా నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అద్భుతమైన నటనతో మెప్పించిన ఈ జంట.. ఈ సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక నేహాకు ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ రిత్యా.. అంతా ఇక ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు అమ్మడుకు తిరుగులేదని.. ఇండస్ట్రీని ఏలేయ‌డం ఖాయ‌మ‌ని భావించారు. కానీ.. ఈమెకు ఊహించిన రేంజ్‌లో ఆఫర్లు రాలేదు. దిల్ సినిమా తర్వాత ఒకటి, రెండు సినిమాల్లో నటించినా ఈమెకు ఊహించిన సక్సెస్ అంద‌లేదు. ఈ క్రమంలో సైడ్ క్యారెక్టర్స్ లోనూ ఆకట్టుకుంది. అందులోనూ పెద్దగా సక్సెస్ రాకపోవడంతో బాలీవుడ్ సీరియల్స్ వైపు మగ్గు చూపింది.

ఇక బుల్లితెరపై అమ్మడికి లక్‌ బాగా కుదిరింది. సీరియల్స్ ద్వారా నిహ‌ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. పలు సీరియల్స్ లో చేస్తూ బిజీగా గడుతున్న సమయంలో కృశాంత్ అనే వ్యక్తిని వివాహం చేస్తుంది. 2010లో పెళ్ళి చేసుకున్న ఈ అమ్మ‌డు తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ప్ర‌స్తుం నేహాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెళ్లి తర్వాత ఈ అమ్మ‌డు పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. సమయాన్ని అంతా కుటుంబానికి కేటాయిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోను యాక్టివ్గా ఉంటుంది. నిత్యం తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే ఒకప్పుడు సినిమాల్లో బొద్దుగా, అందంగా కనిపించిన నేహా.. ఇప్పుడు మాత్రం పూర్తిగా బక్క చిక్కిపోయి.. డల్ ఫేస్‌తో కనబడుతుంది. దీంతో నేహ‌ లేటెస్ట్ లుక్స్ చూసి అంత సరిపోతున్నారు. దిల్ మూవీ హీరోయిన్ ఏంటి మరి ఇంతలా మారిపోయింది.. ఇంత బక్కగా కనిపిస్తుంది ఏంటి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.