అక్కడ కల్కి స్ట్రెటజీని ఫాలో అవుతున్న దేవర.. మ్యాటర్ ఏంటంటే..?

ప్రస్తుతం నార్త్‌ అమెరికాలో ఇండియన్ సినిమాలకు భారీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాలకు అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్పెషల్ ప్రీమియర్స్ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ వరకు మెసస్వ్‌ కలెక్షన్లను మేకర్స్‌కు అందిస్తూ.. సినిమాలు చూడడానికి తెగ అరటపడిపోతున్నారు. మొదటి రోజే రికార్డ్స్ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్‌ని నార్త్ అమెరికా మార్కెట్‌లో తెలుగు సినిమాలు సాధిస్తూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. అలా ఈ ఏడాది నార్త్‌ అమెరికాలో కల్కి 2898ఏడి మూవీ ఏకంగా రూ.18.5 మిలియన్ డాలర్లు కలెక్షన్ కొల్లగొట్టింది. ఇక మొదట రాజమౌళి నుంచి వ‌చ్చిన‌ బాహుబలి సెకండ్ పార్ట్ తర్వాత నార్త్ అమెరికాలో ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకున్న సినిమా కల్కి 2898ఏడి కావడం విశేషం.

Kalki 2898 AD FIRST Review Out: Prabhas, Deepika Padukone & Amitabh  Bachchan's Film Is A Masterpiece - News18

అయితే సినిమా మొదటిరోజు అక్కడ భారీ కలక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాకు మొదటి షో నుంచే స్పెషల్ ధరలు నిర్ణయించడం ఈ రేంజ్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ రావడానికి కారణం అనుకోవచ్చు. ఇప్పుడు నార్త్‌ అమెరికాలో కల్కి వాడిన అదే స్టేటజీని దేవర టీం కూడా వాడుతున్నారు. కల్కి ఎక్స్‌డీ వర్షన్ కి యూఎస్ లో 30 డాలర్ల టికెట్ నిర్ణయించగా.. ఇప్పుడు దేవర సినిమాకు కూడా.. ఎక్స్‌డీ వర్షన్‌లో అదే ధరను ఫిక్స్ చేసినట్లు టాక్. ఎక్కువమంది హెచ్డి వర్షన్ లో సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న క్రమంలో.. టికెట్లు కూడా భారీగా అమ్ముడుపోతున్నాయని.. ఆ ధరలే ఓవరాల్ గా కలెక్షన్ పెరగడానికి కారణం అవుతున్నాయని.. ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దేవర ఎక్స్‌డి వర్షన్‌కు టికెట్ ధరలు కల్కి తరహాలో పెట్టడం వల్ల మొదటి రోజు ఈ సినిమా మంచి వసూళ్ళ‌ను అందుకునే ఛాన్స్ ఉందని సమాచారం.

Devar part 1 Movie || Second single - YouTube

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచ‌నున్నారు. దేవర మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మొదటి రోజు నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాగా ఆర్‌ఆర్ఆర్ నిలిచిన సంగతి తెలిసిందే. దీని తర్వాత స్థానంలో బాహుబలి మూడో స్థానంలో కల్కి సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు దేవర మూవీ రికార్డులను బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలుస్తుందా.. లేదా మరి ఏదైనా సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుందా చూడాలి. ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మొదటి రోజు దేవరకు అక్కడ 2 + మిలియన్ డాలర్స్ పైగా కలెక్షన్లు వస్తాయని భావిస్తున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో వేచి చూడాలి.