ఈ నేషనల్ అవార్డ్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. సౌత్ ఇండస్ట్రీలోనే స్పెషల్ బ్యూటీ..!

ఈ పై ఫోటోలో కనిపిస్తున చిన్నది సౌత్ ఇండస్ట్రీలోనే స్పెషల్ బ్యూటీ. కేవలం గ్లామర్ పాత్రలో మాత్రమే నటించకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. చీరకట్టు సాంప్రదాయంతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. ఈ క్రమంలో అమ్మడు ఇప్పటివరకు నటించిన ప్రతి సినిమా భారీ సక్సెస్ అందుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటనకు గాను ఉత్తమ నటిగా ఇటీవల జాతీయ అవార్డును కూడా దక్కించుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. తనే హీరోయిన్ అపర్ణ బాలమురళి. మహేష్ పగ మూవీతో మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

త‌ర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సురారై పొట్రూ సినిమాల్లో నటించి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తెలుగులోనూ విమానం టైటిల్‌తో డబ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు గాను అమ్మడికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కింది. అపర్ణ తండ్రి బాలమురళి సంగీత విధ్వంసుడు. ఇక‌ తల్లి శోభ లాయర్ వృతలో పనిచేశారు. ఈ క్రమంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అపర్ణ మంచి సక్సెస్ అందుకుంటూ తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటుంది.

ఇక అపర్ణ ఇప్పటికే కోలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే కేవలం నటిగానే కాకుండా.. సింగర్ గాను తన సత్తా చాటుతున్న ఈ అమ్మడు.. సండే హాలిడే సినిమాతో సింగర్ గాను ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల కోలీవుడ్ హీరో ధనుష్ డైరెక్షన్లో వచ్చిన రాయన్ సినిమాలోని మెప్పించింది. ఇందులో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌కు జంటగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం అపర్ణ తమిళ్‌తో పాటు మలయాళం లోను పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతుంది.