టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా మూవీ దేవర మోస్ట్ అవైటెడ్‌గా టాలీవుడ్ ఆడియన్స్‌తో పాటు.. పాన్ ఇండియా లెవెల్లో అభిమానులంతా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మరోవైపు రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు ముందు రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా తర్వాత రాంచరణ్ ఆచార్య సినిమాతో ఫ్లాప్ ను ఎదుర్కొన్నాడు. ఇందులో భాగంగానే రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ తారక్‌కు వర్కౌట్ అవుతుందేమో అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి.
అంతేకాదు ఆచార్యతో డిజాస్టర్ ఇచ్చిన కొరటాల శివతోనే తారక్ నటించి దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న ఈ ముద్దుగుమ్మ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచేసింది. అప్పట్లో తాతతో.. శ్రీదేవి , ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో జూనియర్ శ్రీదేవి అంటూ ఒక టాగ్ నెటింట తెగ ట్రెండింగ్‌గా మారింది. ఇక ఈ సినిమాలో జాన్వి గ్లామర్ షో, డ్యాన్స్‌లతో తారక్‌ను ఓక్కింత డామినేట్ చేసిందన్నడంలో సందేహం లేదు. చుట్టుమల్లె చుట్టేసావే, దీని తర్వాత వచ్చిన దావుది రెండు సాంగ్స్ లోను తన గ్లామర్, డ్యాన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే అమ్మడు దేవర సినిమాలో కొన్ని సీన్స్ జరిగేటప్పుడు చాలా చిరాకుగా ఫీల్ అయిందట.
.ఆ సీన్స్ ఏవో కాదు ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయాల్సి వచ్చినప్పుడే అని.. చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యేదనంటూ వివరించింది. డ్యాన్స్ షూట్ ఉందంటేనే చిరాకు వచ్చేది.. ఇక సినిమాలో డ్యాన్స్ కాకుండా.. ఎన్టీఆర్ తో నటించే సీన్స్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశా అంటూ జాన్వీ ఇటీవల ఇంటర్వ్యూలో వివరించింది. దీంతో ఈ అమ్మడి కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి. కాగా ఈ సినిమాలో జాన్వి కపూర్‌తో పాటు.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలి ఖాన్ కూడా నటిస్తున్నాడు. దీంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను కొత్త నిర్మాణ సంస్థ యువసుధ, అలాగే ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా రూపొందించారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కినట్లు టాక్. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.