పై ఫోటోలో అక్కినేని ఫ్యామిలీతో ఉన్న ఆ స్టార్ హీరోయిన్ కూతుర్ని గుర్తుపట్టారా.. ఆమె ఎవరంటే..?

టాలీవుడ్ లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 100 సంవత్సరాల వేడుకను తాజాగా అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ లెవెల్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏఎన్ఆర్ 100వ జయంతిని.. కొడుకు నాగార్జున ఎంతో గొప్పగా పురస్కరించుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహాన్ని ఘనంగా నివాళులు అర్పించారు. ఇక నాగార్జున ప్రతి ఏడాది వేడుకలను ఇంతే ఘనంగా చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడాది జరిగిన ఈ వేడుకల హంగామా ఇప్పుడే కాదు గత కొద్దిరోజుల ముందే మొదలైపోయింది. ఏఎన్ఆర్ 100 ఇయర్స్ సందర్భంగా ఆయన నటించిన కొన్ని ఐకానికి సినిమాలను ప్రేక్షకుల కోసం రీ రిలీజ్ కూడా చేశారు. ఏఎన్ఆర్ 100 ఫిలిం ఫెస్టివల్ హైదరాబాదులో దేవదాస్ ఫోర్ కే స్క్రీనింగ్ తో మొదలైంది. 31 నగరాల్లో ఏఎన్ఆర్ యొక్క పది ఐకాన్ సినిమాలను ప్రేక్షకులకు ఉచితంగా చూపించారు.

ఈ సందర్భంగా ఏఎన్ఆర్ గౌరవార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను కూడా రిలీజ్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు శ‌తజయంతి సందర్భంగా ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డును చిరంజీవికి ఇస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. అక్టోబర్ 28న అమితాబచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం జరుగుతుందట. ఇక ఈ వేడుకల్లో భాగంగా అక్కినేని కుటుంబం 600 మందికి దుస్తులు పంపిణీ చేశారు. ఇక ఈ వేడుక సందర్భంగా ఫోటోలు, వీడియోలు నెటింట తెగ వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ ఫోటో ఒకటి ట్రెండ్ అవుతుంది. ఈ ఫోటోలు అక్కినేని వారసులంతా కనిపించారు. నాగార్జున – అమల.. వారి కొడుకులు చైతన్య, అఖిల్. అలాగే నాగార్జున అన్న అక్కినేని వెంకట్ – అక్కినేని జోత్స్న.. వారి పిల్లలు, సోదరి నాగ సుశీల.. తన కొడుకు సుశాంత్‌, మ‌రో సోదరి సరోజ అక్కినేని.. కొడుకు సుమంత్, కూతురు సుప్రియ ఇలా అందరూ కలిసి ఈ ఫోటోలో కనిపించారు.

అయితే ఈ ఫ్యామిలీ ఫోటోలు అక్కినేని కుటుంబంతో సంబంధంలేని ఓ స్టార్ హీరోయిన్ కూతురు కూడా ఉండడం విశేషం. ఇంతకీ ఆమె ఎవరు చెప్పలేదు కదా.. త‌నే అలనాటి స్టార్ హీరోయిన్ మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి. సావిత్రి బయోపిక్ మహానటి సినిమా తర్వాత విజయ్ చాముండేశ్వరి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన తల్లి గురించి ఎన్నో విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. ఇక తాజాగా ఏఎన్ఆర్ 100 ఇయర్స్ వేడుకకు ఆమె స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. వేడుక తర్వాత అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో కూడా భాగమైంది. దీంతో ఆమె ఎవరో తెలియని వారు అక్క‌కినేని ఫ్యామిలీతో ఉన్న ఈ అమ్మాయి ఎవరు.. ఆ ఫ్యామిలీ ఫోటోలో తను ఎందుకు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.