టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కనున్న దేవర సినిమా హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమాలు ఈనెల సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నారు. దేవరపై మరింత ఆసక్తిని పెంచే విధంగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా దేవర కోసం వర్క్ చేసిన డిఓపి రత్నవేలు విఎఫ్‌ఎక్స్ పై పెట్టిన పోస్ట్ అందరిలో సినిమా చూడాలని ఆసక్తిని రెట్టింపు చేసింది.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విఎఫ్‌ఎక్స్‌కు పెద్దపీట వేశారన్న సంగతి తెలిసిందే. దీనిపై ఛాయాగ్రహకుడు రత్నవేలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తూ.. దేవర కలర్ గ్రేడింగ్, మ్యాచింగ్, భారీ విఎఫ్‌ఎక్స్.. షాట్స్ కోసం దాదాపు 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపామంటూ చెప్పుకొచ్చాడు. ప్రీమియర్ లాంచ్ ఫార్మేట్, డి బాక్స్, 4dx, ఓవర్సీస్ 2.35 ఎంఎం.. కంపెనీలు కంటెంట్ను సరైన సమయానికి అందజేశాయని వివరించాడు. మా దేవర ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి అంటూ రత్నవేలు తన పోస్టులో షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ తో దిగిన ఫోటోతో పాటు విఎఫ్ఎక్స్ వర్క్ కు సంబంధించిన ఒక పిక్ ను ఫాన్స్ తో షేర్ చేసుకున్న రత్నవేలు ఈ సినిమా విజువల్ వండర్ అంటూ వివరించాడు.
ఇందులోని పాటల గురించి ఆయన షేర్ చేస్తూ డ్యాన్స్‌లో ఎన్టీఆర్ గ్రేస్, స్టైల్, ఎలక్ట్రిఫైయింగ్ స్టెప్స్‌ఖు ఫ్యాన్స్ భ్రమరాధం పడతారని.. థియేటర్లలో పూనకాలు పక్క అంటూ అభిమానులు మరింత జోష్ పెంచారు. ఈ సినిమా కథ చాలా పెద్దదని తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వివరించిన సంగతి తెలిసిందే. మొత్తం కథను తెరకెక్కిస్తే తొమ్మిది గంటలు సమయం పడుతుందని.. కొంత కథతో పార్ట్ వన్ రూపొందించమంటూ వివరించారు. ఇంటిమేట్ సీన్స్ లేకున్నా రొమాంటిక్ సీన్స్ చాలా కొత్తగా అనిపిస్తాయని.. ఐదు పూజ సీక్వెస్ట్ సినిమాకే హైలెట్ అంటూ చెప్పుకొచ్చారు.