టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన మూవీ ప్రేమఖైదీ. హరీష్, మాల శ్రీ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు కొల్లగొట్టిన ఈ సినిమాని.. హిందీలోనూ రీమేక్ చేశారు. అయితే అక్కడ కూడా ఈ సినిమాలో హరీష్ హీరోగా నటించడం విశేషం. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కరిష్మా కపూర్ నటించింది. ఈ సినిమాతోనే 33 ఏళ్ల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కరిష్మా. ఈ సినిమా షూట్ టైంలో జరిగిన ఇంట్రెస్టింగ్ సంఘటన గురించి హీరోయిన్ కరిష్మా కపూర్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. అందులో భాగంగా కరిష్మా మాట్లాడుతూ సినిమా షూట్ టైంలో అనుకోకుండా హరీష్ ప్రమాదంలో పడిపోయారని.. ప్రాణాపాయం నుంచి ఆయనను తనే కాపాడన్నట్టు కరిష్మా కపూర్ వివరించింది.
ఇక ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ,, అప్కా అప్నా జాకీర్ షోలో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రేమ కైది షూట్ టైంలో తన సహనటుడు హరీష్ ప్రాణాలను ఎలా కాపాడిందో వివరించింది. సినిమా షూట్ టైంలో నీటిలో మునిగిపోతున్న నన్ను హరీష్ రక్షించే సన్నివేశాన్ని షూట్ చేస్తున్నామని.. కానీ నిజానికి నేనే ఆయనను కాపాడా అంటూ వివరించింది. ఈ సీన్ స్విమ్మింగ్ పూల్లో షూట్ చేయాలనుకున్నారని.. అయితే అప్పుడు హరీష్ ఎవరికీ తనకు ఈతరాదని చెప్పలేదు అంటూ వివరించింది. అయితే ఆ పూల్లో నాలుగు అడుగుల లోతు వరకు వెళ్లాల్సింది.. మేమిద్దరం సీన్ లో ఇన్వాల్వ్ అయిపోయే ఐదు అడుగుల లోతుకు వెళ్ళిపోయాం. నన్ను రక్షించు.. రక్షించు.. అని నేను అరుస్తున్నా.. అప్పుడే నాకు వెనుక నుంచి నన్ను రక్షించు అనే మాట వినిపించింది అంటూ చెప్పుకొచ్చింది.
వెంటనే వెనక్కి తిరిగి చూస్తే హరీష్ మునిగిపోతూ కనిపించారు. వెంటనే అతని వద్దకు వెళ్లి చేతులు పట్టుకుని లాక్కొచ్చేస. నా ఫస్ట్ మూవీ లో హీరో నా ప్రాణాన్ని కాపాడాలి. అయితే నిజానికి నేనే హీరో ప్రాణాలు కాపాడ అంటూ కరిష్మా వివరించింది. ఇక 1990లో తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ.వి.వి. సత్యనారాయణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకు.. డి.రామానాయుడు హిందీలో ఇదే పేరుతో రీమేక్ చేసాడు. ఈ సినిమా తర్వాత హరీష్ తెలుగులో ఎన్నో సినిమాల్లో మెప్పించాడు. కొండవీటి సింహం, రౌడీ ఇన్స్పెక్టర్, పెళ్ళాం చెబితే వినాలి, గోకులంలో సీత, కొండపల్లి రత్నం, మనవరాలి పెళ్లి లాంటి ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక 2017 వరకు పలు సినిమాల్లో యాక్టివ్ గా కనిపించిన ఈయన తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు.