తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో జానీ మాస్టర్ వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ జానీ మాస్టర్ స్వయంగా ఒప్పుకోవడంతో తనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది బాధ్యత మహిళకు అండగా నిలిచారు. కాగా మరికొందరు జానీ మాస్టర్‌కి కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు జానీ మాస్టర్‌కు తమ సపోర్ట్‌ను అందిస్తూనే.. వచ్చిన ఆరోపణలు నిజం కావాలని లేదు కదా.. ఒకవేళ అది నిజమై ఉంటే న్యాయమే గెలవాలంటే తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇలా జానీ మాస్టర్‌కు మద్దతు తెలిపిన వాళ్లలో నాగబాబు కూడా ఒకరు.
ఇక జానీ మాస్టర్ మొదటి నుంచి మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన సంగతి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ గురించి నాగ బాబు పరోక్షంగా చేసిన ఈ పోస్ట్ విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలోనే సినీ నటి మాధవి లత సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా జానీ మాస్టర్ మద్దతు తెలుపుతున్న వారికి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది. మెగా బ్రదర్ నాగబాబు.. జానీ మాస్టర్ కు సపోర్ట్ చేయడంతో తను చాలా బాధపడ్డాను అంటూ వివరించింది. నాగబాబుకి కూడా ఒక కూతురు ఉంది. ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. అలాగే కూతురు కంటే వయసులో ఆ బాధిత మహిళా చాలా చిన్నది అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక మహాసేన రాజేష్ అనే వ్యక్తి కూడా జానీ మాస్టర్‌కి సపోర్ట్‌గా మాట్లాడుతూ జనాని తప్పుదోవ పట్టిస్తున్నాడని.. ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన ఇలాంటి విషయం పట్ల ఎందుకంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ప్రశ్నించింది. జానీ మాస్టర్‌తో పనిచేయడం వల్ల ఆయన మీకు మంచివాడు అయ్యుండొచ్చు.. కానీ అమ్మాయికి కాదు కదా అంటూ చెప్పుకొచ్చింది. ఒక అమ్మాయిని తన ఇష్టం లేకుండా ఎవరూ తాకకూడదని.. అది పూర్తిగా తప్పేనని నాగబాబుతో పాటు.. ఇతర ట్రోల్లెర్స్ అందరికి కలిపి కౌంటర్ ఇచ్చింది మాధవి. అంతేకాదు బాధిత మహిళకు అండగా నిలుస్తానని మాధవి లత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.