మొదటిసారి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ పోస్ట్ షేర్ చేసిన తారక్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

తెలుగు సినీ పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుని దూసుకుపోతున్న స్టార్ హీరోస్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీళ్లిద్దరుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చాలామంది స్టార్ హీరోస్‌కు జ‌ల‌స్‌ ఉంటుంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిస్తే చూడాలని కోట్లాదిమంది అభిమానులు అరటపడుతూ ఉంటారు. అయితే గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించిన సంద‌ర్భాలు ఉన్నాయి. అరవింద సమేత మూవీ ఓపెనింగ్స్ లో పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చి క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌గా మారాయి. అంతేకాదు.. అంతకుముందు రామ్‌చరణ్ ఎంగేజ్మెంట్ వేడుకలను పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నా వీడియో గతంలో వైర‌ల్ అయ్యింది. ఇలా ఇద్దరు కలిసిన ప్రతి మూమెంట్ అభిమానుల‌కు ఎక పండ‌గ‌.

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ 2021 టార్గెట్స్.. అభిమానులకు పండగే! | Pawan kalyan jr ntr upcoming movie in next year - Telugu Filmibeat

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ గురించి ఏవో సందర్భాల్లో ముచటిస్తూనే ఉంటారు. ఆయన డ్యాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని వివరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది లేదు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త నిరాశ చెందినా.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుకు విషెస్ తెలియజేస్తూ ఎన్టీఆర్ ఓ ట్విట్ చేశారు. దీంతో అభిమానులు కాస్త కూల్ అయ్యారు. ఇక తాజాగా మరోసారి ఎన్టీఆర్.. పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తు ట్విట్‌ జేశారు. దానికి కారణం దేవర స్పెషల్ పర్మిషన్స్. దేవర సినిమాకు ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్స్, అదనపుషోస్‌కు ప‌ర్మిష‌న్‌ ఇచ్చినందుకు ఈ సినిమా యూనిట్‌తో పాటు.. ఎన్టీఆర్ కూడా కృత‌ఙ‌త‌లు తెలియ‌జేశారు.

NTR -Pawan Kalyan : మరోసారి పవర్ స్టార్‌తో పోటీకి దిగుతున్న ఎన్టీఆర్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా - Telugu News | NTR Devara movie and Pawan Kalyan's OG will release within a gap of few

పవన్, చంద్రబాబు నాయుడులను ఎన్టీఆర్ ట్యాగ్ చేస్తూ.. మా దేవర సినిమాకు అన్ని విధాలుగా సహకరిస్తూ రేట్స్, స్పెషల్ షోలకు పర్మిషన్స్ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు. తెలుగు సినిమాకు మీరు చేస్తున్న సేవలు ఎంతో అద్భుతం. అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దొర్గేష్ గారికి కూడా ధన్యవాదాలు అంటూ తెలియజేశాడు ఎన్టీఆర్. ఇక మరో వారంరోజుల్లో దేవర సినిమా ఆంధ్రప్రదేశ్‌లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. అర్ధరాత్రి 12 గంటలకు స్పెషల్ షోస్‌తో అభిమానులు సందడి చేయనున్నారు. టికెట్ రేట్స్.. రెండు వారాలపాటు సింగిల్ స్క్రీన్ కు రూ.110 మల్టీప్లెక్స్ రూ.135 పెంచుకునేందుకు పర్మిషన్లు ఇచ్చారు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి ఈ రేంజ్ టికెట్ రేట్స్ పెడితే ఇక కలెక్షన్స్ పరంగా మొదటి రోజే భారీ వసూలు వస్తాయి అనడంలో సందేహం లేదు.