బాలయ్య ఫ్యాన్స్‌కు దసరా డబుల్ ధమాకా.. ఎన్‌బికే 109 గుస్‌బంప్స్ అప్డేట్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటూ హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుస సక్సెస్ లో అందుకునే హ్యాట్రిక్‌తో దూసుకుపోతున్న బాలయ్య.. కేవలం సినిమాల పరంగానే కాదు రాజకీయాల పరంగాను వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ దక్కించుకున్నాడు. ఇలా ప్రస్తుతం హ్యాట్రిక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న ఈ సీనియర్ హీరో.. బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

NBK 109 Shooting Update : బాలయ్య NBK109 షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? |  Balakrishna director bobby nbk 109 movie shooting update-10TV Telugu

వీరి కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇప్పటివరకు ఏవి బయటకు రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాబి ఎంబికే 109 టైటిల్ రివిల్ చేయడానికి రెడీ అయ్యారట. ఇటీవల జరిగిన బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల్లో టైటిల్ను ప్రకటించాలని అనుకున్నారని.. అయితే కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేద‌ని టాక్‌. అందుకే దసరా కానుకగా టైటిల్ తో పాటు.. సినిమా నుంచి ఓ పాటను కూడా ప్రేక్షకుల ముందుకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Balakrishna as 'Monster' in 'NBK 109' glimpse

ఇక క్రమంలో బాలయ్య ఫ్యాన్స్ కు ఒకేసారి డబ్బల్‌ ధమాకా తో ద‌స‌రాకి ఫుల్ కిక్ ఇవ్వాలని బాబీ ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ అవ్వడంతో.. దసరా కోసం బాలయ్య అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇక మొదట సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్‌ భావించినా.. సంక్రాంతికి రావలసిన రవితేజ సినిమా వాయిదా పడడంతో ఈసారి సంక్రాంతి కానుకగా రవితేజ సినిమా ప్లేస్‌లో బాలయ్య సినిమాను రిలీజ్ చేయనున్నారట.