12 రోజులు పడుకుంటే ఫ్లాట్.. చెప్పింది చేస్తే కార్.. తెలుగు హీరోయిన్‌తో షాకింగ్ బిహేవియర్..!

గతంలో కేవలం నార్త్ హీరోయిన్స్ మాత్రమే బోల్డ్ సన్నివేశాలకు గ్రీన్ సెగ్నల్ ఇస్తు నటించేవారు. కానీ.. ఇటీవల కాలంలో మన తెలుగు అమ్మాయిలు కూడా కాస్త తెగించి.. ఎలాంటి సినిమాల్లో అయినా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలా డిఫరెంట్ పాత్రలో నటించి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో.. నటి గాయత్రి గుప్తా కూడా ఒకటి. అచ్చ తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదట టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి సంచలనంగా మారింది. అప్పటినుంచి ఎప్పటికప్పుడు పలు ఇంటర్వ్యూలో బోల్డ్‌గా మాట్లాడుతూ అందరికీ షాక్ ఇస్తూనే ఉంది. ఇలాంటి క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా.. బాలీవుడ్ కాస్టింగ్ కౌచ్‌పై చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.

మొదట బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మంచి పాపులారిటీ దక్కించుకున్న తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా గాయత్రి.. ఫిదా, ఐస్క్రీమ్ టు, కొబ్బరి మట్ట, మిఠాయి ఇలా ఎన్నో సినిమాలు తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్ళికి ముందు, సీత ఆన్‌ రోడ్ అనే షార్ట్ ఫిలింలోనూ నటించి మెప్పించింది. ఇక తర్వాత అవకాశాలు తగ్గడంతో.. కెరీర్ నెమ్మ‌దించిన ఈ అమ్మడు వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుంటూ తన సత్తా చాటుతుంది. అలా ఇటీవల కాలంలో అన్ స్టాపబుల్, ఫ్లాట్, డబుల్ ఇంజన్ సినిమాల్లో నటించింది. ఇక గతేడాది వచ్చిన దయా వెబ్ సిరీస్ లో ఓ కీల‌క పాత్రలో నటించి హైలెట్గా నిలిచింది. కాస్టింగ్ కైచ్ అనే మాట గ‌తంలో తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనాల సృష్టించిన సంగతి తెలిసిందే.

అయితే దీన్ని మొదట బయటకు తీసుకు వచ్చినది గాయత్రి గుప్తానే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తరువాత శ్రీ రెడ్డి ఈ కాస్టింగ్ కోచ్ వివాదాన్ని కంటిన్యూ చేసింది. అంతేకాదు గాయత్రి గుప్తా పలు వివాదాల్లోనూ చిక్కుకుంది. బిగ్ బాస్ రియాల్టీ షోను బ్యాన్ చేయాలంటూ ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర వరకు వెళ్లి మరి పోరాటాన్ని మొదలుపెట్టింది. ఈ క్రమంలో అమ్మడు దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఆమె ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. తర్వాత పరిస్థితుల రిత్యా త‌న‌కు బిగ్‌బాస్ సీజన్ 8 లో ఆఫర్ వచ్చిందని.. దానిని ఆమె రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక ఇటీవల మరోసారి గాయత్రి గుప్తా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై రియాక్ట్ అయింది.

ఓ యూట్యూబ్ ఛానల్ లో గాయత్రి మాట్లాడుతూ బాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్‌ ఉందని.. నేను తెలుగులో కొన్ని సినిమాల్లో నటించా తర్వాత ఆఫర్లు మెల్లగా తగ్గాయి. ఆ టైంలోనే నాకు బాలీవుడ్ ఛాన్స్ వచ్చింది. అయితే ఆ ఆఫర్ ఇస్తామని చెప్పి కొందరు అస‌భ్య‌క‌రంగా మాట్లాడారు. 12 రోజులు వాళ్లతో నేను పడుకోవాలని.. అలా చేస్తే ఫ్లాట్, కారు, పది లక్షల రూపాయలు ఇస్తామని అన్నారని.. నాకు ఎవరికీ చెప్పాలో కూడా అర్థం కాలేదు.. వెంటనే అక్కడి నుంచి వచ్చేసా అంటూ చెప్పుకొచ్చింది. ఇలా కాస్టింగ్ కౌచ్ కేవ‌లం టాలీవుడ్‌లోనే కాదు.. అన్ని చోట్ల ఉంది అంటూ గాయత్రి గుప్తా వివరించింది. ప్రస్తుతం గాయత్రి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.