గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్న ఎన్టీఆర్ తాజా మూవీ దేవర సినిమాపై ప్రేక్షకులో మంచి అంయనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాపై ఉన్న పాజిటివ్ హైప్‌తో పాటూ.. గత కొంతకాలంగా విపరీతమైన నెగెటివిటీ కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పనిగట్టుకుని ఎన్టీఆర్ దేవర సినిమాపై విష ప్రచారం చేయడం పై ఫైర్ అవుతున్నారు. మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్న.. వారిలో ఎక్కడో చిన్న ఆందోళన ఉందనటంలో సందేహం లేదు.
ఈ క్రమంలోనే తారక్ ఫ్యాన్స్ అంతా.. బాలయ్య అంటే నందమూరి ఫ్యాన్స్, మహేష్, బన్నీ అభిమానులను రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటింట వైరల్‌గా మారుతున్న క్రమంలో.. ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. మా తారక్ అన్న కోసం గట్టిగా కష్టపడుతున్న నందమూరి బాలకృష్ణ.. బాలయ్య బాబాయ్ ఫ్యాన్స్ కి , మహేష్ అన్న, బన్నీ బావ ఫ్యాన్స్ కి ఒకటే చెప్పాలనుకుంటున్నాం.
ఇప్పుడు మా హీరో సినిమా కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో మీ హీరో మూవీ రిలీజ్ టైం లో మీ కన్నా గట్టిగా మేము డ్యూటీ చేసి మీ రుణాన్ని తీర్చుకుంటామంటూ కామెంట్లు ఇస్తున్నారు. జనతా గ్యారేజ్ టీం ఇన్స్పిరేషన్తో డ్యూటీ చేద్దాం.. ఈ మాఫియా నుండి సినీ పరిశ్రమను రక్షిద్దాం అంటూ రిక్వెస్ట్‌లా పోస్ట్‌లు షేర్ చేస్తు వైరల్ చేస్తున్నారు. మరి ఈ రిక్వెస్ట్లు దేవరకు ఎంతగా సహాయం అవుతాయో వేచి చూడాలి. ఇక ఈ నెల 27న సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఇప్పటివరకు వచ్చిన నెగిటివ్ కామెంట్లకు ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.