పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సస్‌ను ప్రభాస్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక తాజాగా తన కొత్త సినిమాను డార్లాంగ్ ప్రారంభించాడు. ఫౌజీ టైటిల్‌తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంది. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాకోసం ఎన్నో రోజులుగా కష్టపడుతున్నాడు. సీతారామం తర్వాత చాలా గ్యాప్‌తో హను ఇప్పుడు ప్రభాస్ తో ఫౌజి తీసేందుకు సిద్ధమయ్యాడు. ఇక తాజాగా ఆగస్టు 17న హైదరాబాద్‌లో భారీ పూజా కార్యక్రమాలతో మూవీ పనులు గ్రాండ్ లెవెల్‌లో ప్రారంభించారు.
కాగా ఈ వేడుకలకు ప్రభాస్ తన లగ్జరీ కార్‌లో హాజరై సందడి చేశాడు. ఎంత స్టైలిష్ లుక్ తో ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్.. బ్లాక్ అవుట్ ఫిట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఎంట్రీ కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ వచ్చిన లగ్జరీ కార్.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇంతకీ అ లగ్జరీ కార్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఇంతకీ ఆ కార్ కాస్ట్ ఎంత.. దాని మోడల్ ఏంటి అనుకుంటున్నారా.. అదే స్వాంకీ రేంజ్ రోవర్ కార్. ఈ లగ్జరీ కార్ లో దాదాపు అన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఇక దీని ధర ఏకంగా రూ.2.7 నుంచి రూ.3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం ప్రభాస్ దిగిన ఈ కార్ కాస్ట్ తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అది రెబల్ స్టార్ రేంజ్ అంటూ.. ప్రభాస్ అన్న అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం షూట్‌కు సిద్ధంగా ఉన్న పౌజి.. ఆగస్టు 24 నుంచి హైదరాబాద్‌లో సెట్స్ పైకి రానుందట. స్వతంత్రానికి పూర్వం జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ జంటగా ఇమాన్ యిస్మయిల్ నటించనుంది. ఇక ఈ లాంచ్ ఈవెంట్లో ప్రభాస్ తో పాటు ఆమె కూడా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఫౌజితో పాటు ప్రభాస్.. పలు సినిమాలతో బిజీ షెడ్యూల్ నడుస్తున్న సంగతి తెలిసిందే.