హీరో శ్రీ విష్ణు కుటుంబాన్ని చూశారా.. భార్యా పిల్లల ఫోటోలు షేర్ చేసిన హీరో..!

మంచి ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుంటున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. గత కొద్దిరోజులుగా సెలెక్టెడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తూ సక్సెస్ అందుకుంటున్న ఈయన.. ప్రస్తుతం స్వాగ్‌ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే శ్రీ విష్ణు సినిమాల గురించి తప్ప.. తన ఫ్యామిలీ గురించి బయట ప్రపంచానికి అంతగా తెలియదు. ఎప్పుడూ ఆయన కూడా ఈ విషయాలను రివిల్ చేయలేదు. అలాగే సినిమా ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీలలోను శ్రీ విష్ణు ఫ్యామిలీ అసలు కనిపించలేదు. అలా ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన.. కొన్ని రోజులుగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో అందుకుంటు దూసుకుపోతున్నాడు.

సామజ వరగమన మూవీ తో కెరీర్ లోనే బిగ్ హిట్‌ను అందుకున్న ఆయ‌న.. మొదటిసారి ఈ సినిమాతో రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టారు. ఆ తర్వాత ఓం భీం బుష్ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. ప్రొడ్యూసర్లకు లాభాల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం శ్రీ విష్ణు చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. సెలెక్టెడ్ సినిమాలని ఎంచుకుంటూ.. కంటెంట్ నచ్చితేనే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న శ్రీ విష్ణు.. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ విషయాలను గోప్యంగా ఉంచుతూ ఉంటాడు. ఇలాంటి క్రమంలో తాజాగా శ్రీ విష్ణు ఫ్యామిలీ ఫోటో ఒకటి నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. ఇటీవల తన భార్య ప్రశాంతి పుట్టినరోజు సందర్భంగా.. భార్య, కూతురు మ్రిదాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ స్పెషల్ బర్త్డే విషెస్ తెలియజేశాడు హీరో శ్రీ విష్ణు.

Sree Vishnu (Sri Vishnu) - Photos, Videos, Birthday, Latest News, Height In  Feet - FilmiBeat

అంతే కాదు వెకేషన్ నుంచి తన భార్య ఫోటోలు స్పెషల్గా షేర్ చేస్తూ.. విషెస్ తెలియజేశాడు. ప్రస్తుతం శ్రీ విష్ణు షేర్ చేసిన ఈ ఫొటోస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. తమ ఫేవరెట్ హీరోకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ.. అంతా ఆశ్చర్యపోతున్నారు. అలాగే శ్రీ విష్ణు కూతురు చాలా క్యూట్ గా ఉందంటూ.. పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీ విష్ణు నటించిన స్వాగ్‌ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మీరాజాస్మిన్, దక్షిన‌గార్కర్, శరణ్య ప్రదీప్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా.. హ‌సిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ లో సునీల్, రవిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు.