ఆ టాలీవుడ్ డైరెక్టర్ శృతిహాసన్ ని అంతలా టార్చర్ చేశారా.. ?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ శృతిహాసన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కమలహాసన్ నటవరసరాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. యంగ్ హీరోల‌ నుంచి సీనియర్ హీరోల వరకు దాదాపు తెలుగు అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి మెప్పించింది. అయితే ప్లాపు హీరోలకు హీట్లిస్తుందని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న శృతిహాసన్.. మొదట ఫ్లాప్‌లో కూరుకుపోయిన పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన సంగతి తెలిసిందే. తర్వాత ఎంతోమంది హీరోలతో నటించి వారికి సక్సెస్ అందించిన ఈ అమ్మడు.. ఇక గ‌తేడాది బాలకృష్ణ, చిరంజీవి, ప్రభాస్‌ల‌తో నటించి ముగ్గురికి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందించింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌లో.. అడవి శేష్ డెకాయిట్ సినిమాలోను.. ప్రభాస్ తో సలార్ 2 సినిమాలోను న‌టిస్తూ బిజీగా ఉంది.

NTR30: Koratala Siva has got two options - News - IndiaGlitz.com

అయితే అలాంటి స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌ను.. గతంలో ఒక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెగ టార్చర్ చేశాడంటూ ఆయన వేధించడంతో.. తను నటించడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సినిమా నుంచి మధ్యలోనే తప్పకుందంటూ వార్త‌లు వినిపించాయి. ఈంత‌కి ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రు.. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు మాస్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన బోయపాటి. కె.ఎస్. రామారావు ప్రొడ్యూసర్ గా.. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దమ్ము సినిమా రిలీజై.. ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. అయితే ఈ మూవీలో మెయిన్ హీరోయిన్‌గా త్రిష.. సెకండ్ హీరోయిన్ గా కార్తీక నటించి మెప్పించారు. కానీ త్రిష కంటే ముందు మెయిన్ హీరోయిన్‌గా సినిమాలో శృతిహాసన్ ను ఫిక్స్ చేశారట.

Dhammu | Cinema Chaat

ఆ సినిమా టైంలో శృతిహాసన్‌కి.. బోయపాటి శ్రీనుకు మధ్యన చిన్నపాటి గొడవలు జరగడం అవికాస్త పెద్దవిగా మార‌డడంతో.. శృతిహాసన్ సినిమా నుంచి తప్పుకుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆ గొడవల్ని దృష్టిలో పెట్టుకొని శృతిహాసన్‌ను షూటింగ్ టైంలో బోయపాటి తెగ వేధించాడని.. అందుకే ఈ అమ్మడు ఆ సినిమా నుంచి తప్పుకుందంటూ అప్పట్లో ఫిలిం సర్కిల్లో వార్తలు తెగ వైరల్‌గా మారాయి. అయితే ఆ వార్తలని ఫేక్ అని.. బోయపాటికి, శృతికి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని తాజాగా ఈవెంట్లో పాల్గొన్న దమ్ము మూవీ ప్రొడ్యూసర్ కె ఎస్ రామారావు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బోయపాటి శ్రీనుకి శృతిహాసన్‌కు మధ్యన ఎలాంటి వివాదాలు లేవు. ఆయన శృతిహాసన్ ను ఎప్పుడు వేధించలేదు. శృతి వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో.. డేట్‌లు అడ్జస్ట్ చేయలేకపోయింది. దీంతో ఆ సినిమాను తను వదులుకుంది. కానీ ఈ సినిమాలో శృతిహాసన్ తీసుకుందామని అందరం భావించం. ఆమె డేట్స్ లేవని రిజెక్ట్ చేయడంతో సినిమాలో త్రిషను తీసుకున్నాం అంతే అంటూ వివరించాడు.