ఈ పై ఫోటోలో మెగా బ్రదర్స్ చిరు, నాగ బాబు, పవన్ కల్యాణ్ మధ్యలో క్యూట్ లుక్‌తో పవర్ స్టార్ భుజాలపై కూర్చోని కనిపిస్తున్న పిల్లాడిని గుర్తు పట్టారా..? ఈ బుడ్డోడు ప్రస్తుతం టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. ఆరడుగుల హైట్.. యునిక్ స్టైల్‌తో అమ్మాయిల డ్రీమ్ బాయ్‌గా మారిపోయాడు. ఇంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ కుర్రోడు సినిమాల విషయంలోను తన యూనిక్‌నేస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇతర హీరోల్లా కమర్షియల్ సినిమాలు కాకుండా వైవిధ్యమైన కథలను ఇంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో బిఇజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం కెరీర్ కొంచెం డౌన్ ఫాల్ అయిన్నా డబుల్ యాక్టీవ్నెస్‌తో కొత్త సినిమాలతో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.
ఇంతకీ ఆ బుడ్డొడిని గుర్తుపట్టారా..? సర్లేండి రివీల్ చేసేస్తాం. ఆ కుర్రాడు మరెవరో కాదు.. మెగా ప్రిన్స్.. వరుణ్ తేజ్. నాగ బాబు తనయుడుగా మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక ఈ పై ఫొటో ఆయన చిన్ననాటి క్యూట్ మెమొరి. కాగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఓ స్పెషల్ ఇమేజ్, స్టేటస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి ఏకంగా డజనకు పైగా హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి రాణిస్తున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఇలా ఇంత మంది అడుగు పెట్టిన టాలీవుడ్ లో తమకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు.
అయితే వరుణ్ తేజ్ అందరిలో చాలా స్పెషల్. కెరీర్ ప్రారంభం నుంచే కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ.. డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చాలా ఫ్లాప్‌లు ఎదురైనా సరికొత్త కథలతో ఆడియన్స్‌ను పలకరిస్తున్నాడు. ఇక గతేడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ హీరో..సొటబుగ్గల సుందరి.. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేశాడు. ఇక చివరిగా ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ఫ్లాప్ చూసిన ఈయన.. ఇప్పుడు మట్కా సినిమాలో నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజై సినిమాపై ఆసక్తిని పెంచింది.