నెలన్నర నుంచి కేవలం ఏడుపే మిగిలింది.. నిద్ర కూడా లేదు.. సింగర్

ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకోవాలని ఆశతో ఎంతోమంది ప్రతి ఏడాది అడుగుపెడుతూ ఉంటారు. అలా ఒకే ఒక్క ఛాన్స్ సాధించి తన సత్తా ఏంటో చూపించింది మలయాళ సింగర్ అంజు జోసఫ్. 2010లో ఐడియా స్టార్ సింగర్ మలయాళం సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ అమ్మడు.. తన గొంతుతో అందరిని ఆకట్టుకుంది. సినిమాలో బ్యాక్గ్రౌండ్ సింగర్ గా పాడడం స్టార్ట్ చేసింది. అతి కొద్ది టైంలోనే కవర్ సాంగ్స్, స్టేజ్ షో ల వరకు అమ్మడు ఎదిగింది. బాహుబలి మూవీ లోని ధృవ‌రా పాటకు ఈమె చేసిన కవర్ సాంగ్ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇకపోతే అంజు ఆ షో డైరెక్టర్ అనుప‌మ్ జాన్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. 5 ఏళ్ళు కలిసిమెలిసి ఉన్నారు. అయితే తర్వాత ఏవో కారణాలతో విడాకులు తీసుకున్నారు.

ఆ టైంలో తను పడ్డ మానసిక వేదనను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న అంజు.. నాకు అబ్‌స్సివ్ కంపల్సిన్ పర్సనాలిటీ డిసార్డర్( OCPD) ఉందంటూ వివరించింది. ఈ డిసార్డర్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఏ పనినైనా పూర్తిగా చేయాలని భావిస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా ఆలోచించి ఆందోళనలు పడుతూ ఉంటారు. వాటికి మందులు కూడా తీసుకుంటున్నాను అంటూ ఈ అమ్మడు వివరించింది. ఇక రిలేషన్ లో ఉన్న క్రమంలోనే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని.. దాని కారణంగానే నేను ఇప్పుడు మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ వివరించింది. నెల‌న్న‌ర నుంచి నాకు అసలు నిద్ర పట్టడం లేదని.. రాత్రులు కూడా మెలకువగానే ఉంటున్నా.. కానీ బెడ్ పై నుంచి లేవబుద్ధి కావడం లేదు. అసలు నేనేం ఆలోచించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక పరిస్థితి ఎలా ఉన్నా తెచ్చి పెట్టుకున్న నవ్వుతో షోలు మాత్రం చేశాను.

 అది నా వృత్తి. పైగా నేను ఏదైనా పర్ఫెక్ట్ గా చేయాలని భావిస్తా. కాబట్టి తెచ్చి పెట్టుకున్న నవ్వుతో పని కంప్లీట్ చేశా. కానీ.. నా శరీరంలో సమస్యలు వచ్చాయి. నేను ఏడ్చిన తర్వాతే షోకి వస్తున్నానని అక్కడ ఉన్న వారందరికీ తెలిసిపోతుంది. నా డింఓర్స్‌కి ఓసిపిడి ఒక్కటే కారణమైతే కాదు. ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే బంధం ముక్కలైందని నేనేమీ బాధపడట్లేదు. దాని నుంచి ఎంతో నేర్చుకుంటున్నా. అసలు నేనేంటో ఇప్పుడే తెలుసుకుంటున్నా అంటూ వివరించింది. ఇక ప్రస్తుతానికి ఏడుపు ఒక్కటే నాకు మిగిలింది. దానికి కూడా థెరఫీ చేయించుకుంటున్నా. జీవితం ముందుకు వెళ్లట్లేదు. అలాగని బలవంతంగా చనిపోను. అయినా విడాకులు తీసుకోవడం పెద్ద నేరమేమి కాదంటూ చెప్పుకొచ్చింది. విడాకులు తీసుకున్న వాళ్ళు అంతా చెడ్డ వాళ్ళు కాదు అంటూ సింగర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట‌టింట వైరల్ గా మారాయి.