టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేడు సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున అభిమానులతో పాటు ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్.. సన్నిహితులు కూడా చిరుకు విషెస్ తెలియజేస్తున్నారు. సన్నిహితులు.. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. లక్షలాదిమంది మెగా ఫ్యాన్స్ వేరువేరు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది కుటుంబ సభ్యులు ఆయనతో ఉన్న పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆ ఆనందాని షేర్ చేసుకుంటున్నారు. అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. అలా తాజాగా ఈ పై ఫోటో ఒకటి నెటింట తెగ వైరల్ గా మారింది. అయితే ఇంతకీ ఈ ఫోటోలో చిరంజీవి ఎత్తుకున్న ఆ పాప ఎవరో గుర్తుపట్టారా.. చిన్న ఏజ్‌లోనే బుల్లితెరపై సందడి చేసిన ఈ అమ్మడు.. తర్వాత హీరోయిన్‌గాను సినిమాలో నటించి మెప్పించింది.
వెబ్ సిరీస్లలో కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడైతే ఏకంగా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పాటు.. సాధారణ సినిమాలను కూడా నిర్మిస్తూ మంచి నిర్మాతగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మొదట ఈమె సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారింది. ఆ సినిమా తాజాగా రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఇంత చెప్పినా ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టలేదా.. అయితే మేము చెప్పేస్తాం లెండి. ఆమె మెగా డాటర్ నిహారిక. నిహారిక నిర్మాతగా మారి తాజాగా కమిటీ కుర్రాళ్లు సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. ముందు ముందు నిహారిక ప్రొడ్యూసర్ గా మరిన్ని పెద్ద సినిమాలు చేయాలని ఆమె అభిమానులు ఎంతగానో భావిస్తున్నారు. ఇక.. నటిగా నిహారికకు పెద్దగా ఎంకరేజ్మెంట్ లేకపోయినా.. ప్రొడ్యూసర్ గా మాత్రం ఆమె ఎదగడానికి మెగా ఫ్యామిలీతో పాటు.. మెగా ఫ్యాన్స్ కూడా ఎంతగానో ప్రోత్సహించారు.
అందుకే కమిటీ కుర్రాళ్ళు సినిమా భారీ కలెక్షన్లు అందుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో నిహారిక షేర్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. పెదనాన్నకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ నిహారిక ఫోటోలు షేర్ చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈ ఫోటో పై రియాక్ట్ అయిన ఎంతోమంది అభిమానులు.. ఈ ఫోటో ఎప్పటికీ ఓల్డ్ ఫోటో అవ్వదు అంటూ.. ఇంతకీ పెదనాన్నకు నిహారిక ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఏమై ఉంటుంది అంటూ.. చిరంజీవికి తన ఇద్దరు కూతుర్లతో పాటు నిహారిక కూడా సమానమే అంటూ.. మెగా అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిహారిక కూడా మొదటి నుంచి తండ్రి నాగబాబుని ఏ విధంగా గౌరవిస్తుందో.. చిరంజీవిని కూడా అదే విధంగా గౌరవిస్తుంది.