అల్లు అర్జున్ ఆర్మీపై మెగా ఫ్యాన్స్ సెటైర్లు.. పిల్లకాయలంటూ..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో రాజుకున్న మెగా వర్సెస్ అల్లు వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. ఇటీవల చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్ చేయడంతో మెగా అభిమానులు థియేటర్లలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏకంగా యంగ్ స్టర్స్ మాత్రమే కాదు 60 ఏళ్ళ వయసున్న ఓల్డేజ్ పీపుల్స్ కూడా థియేటర్లలో సందడి చేస్తూ డాన్సులు వేయడం మనం చూడవచ్చు . ఇప్పుడు ఆ థియేటర్లలో కూడా బన్నీ టీజ్ చేస్తూ, సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు సోషల్ మీడియాకే పరిమితమైన ఈ టీజింగ్ ఇప్పుడు మీడియా వరకు కూడా చేరిపోయింది.

200+] Allu Arjun Pictures | Wallpapers.com

చిరుకి శివాజీ వెన్నుపోటు పొడిచే సీన్ వచ్చినప్పుడు బన్నీ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటికి బన్నీ ఫాన్స్ కూడా గట్టిగానే కౌంటర్లు వేశారు. కానీ ఇప్పటివరకు సోషల్ మీడియాకే పరిమితమైన ఈ ఫ్యాన్స్ వార్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసింది అని చెప్పవచ్చు. ఇంద్ర రీ రిలీస్ వేళ.. ఫ్యాన్స్ ముందు మీడియా మైక్ పెట్టడంతో అల్లు అర్జున్ పై ఒక రేంజ్ లో రెచ్చిపోయారు మెగా అభిమానులు. ఈ వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మెగా నుంచి అల్లు అర్జున్ బయటకి వచ్చేస్తారని అంటున్నారు దీనిపై మీరేం అంటారు అంటూ మీడియా ప్రశ్నిస్తుంటే.. ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఏకీపారేస్తున్నారు. వచ్చేనివ్వండి..మాకే మంచిది.. అల్లు అర్జున్ సినిమాలకి ఫ్లెక్సీలు కట్టి మాకే డబ్బులు బొక్క కదా.. మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

Mega Star Chiranjeevi extremely proud of Jana Senani Pawan Kalyan - Telugu  News - IndiaGlitz.com

మరొక ఫ్యాన్ అల్లు అర్జున్ కి ఆర్మీ ఉంది కదా పాపం అది స్కూల్ కి వెళ్ళింది. టైం అయింది కదా.. సాయంత్రం వస్తారు.. వాళ్ళలా సోషల్ మీడియాలో హడావిడి చేయడం కాదు మా పని. బాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అయింది కదా.. ఇప్పుడు బ్లడ్ బ్యాంకు కి వెళ్లి రక్తం ఇస్తాము.. మా హీరో మాకు సంస్కారమే ఇచ్చాడు… పాపం వాళ్లంతా పిల్ల బచ్చాలు అంటూ కామెంట్లు చేశారు.