ఉస్తాద్ రామ్ పోతినేని సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ డబల్ ఇస్మార్ట్. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మికౌర్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ నేడు ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉందో.. ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించిందో.. ఒకసారి చూద్దాం.
ఈ సినిమా చూసిన ఆడియన్స్‌లో పలువురు నేటిజన్ రివ్యూ ఇస్తూ.. సినిమాను చూశా.. పూరి కనెక్ట్స్, రామ్ పోతినేని మళ్లీ కం బ్యాక్ ఇవ్వడం ఖాయం.. హీరో రామ్ ఇచ్చిపడేసాడు. ఇక సంజయ్ దత్ యాక్టింగ్ అదుర్స్. కామెడీ టైమింగ్, bgm సినిమాల్లో హైలెట్ అంటూ.. మరికొందరు.. శంకర్‌గా రామ్‌పోతునేని మాస్ ఎలిమెంట్స్, ఎనర్జీ అదుర్స్ అంటూ.. పూరి జగన్నాథ్ మరోసారి కం బ్యాక్ ఇవ్వడం పక్కా.. మూవీ డైలాగ్స్, సాంగ్స్ సినిమాకు హైలెట్. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ స్టైల్‌లోనే ఉన్నా.. కథ మాత్రం అద్భుతంగా ఉంది.
పూరీ జగన్నాథ్ సినిమాను వేరే లెవెల్లో తీర్చిదిద్దారు. పార్ట్ వన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా డబ్బులు ఇస్మార్ట్ మెప్పిస్తుంది అంటూ.. మరికొందరు కామెంట్స్ చేశారు. అయితే ఓ నెటిజన్ మాత్రం.. డబ్బుల్ ఇస్మార్ట్ కంటే చెత్త మూవీ ఇంకోటి ఉండదు. ఈ దశాబ్దంలోనే డబ్బుల్ ఇస్మార్ట్ చెత్త మూవీ. ఈ సినిమా చూడకుండా వదిలేస్తే మనశాంతి ఉంటుంది, డబ్బులైన మిగులుతాయి అంటూ నెగిటివ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, అయితే ఇప్పటివరకు వచ్చిన ఆడియన్స్ రివ్యూలను బట్టి.. అడపా దడపా నెగటివ్ కామెంట్స్ వినిపించినా.. చాలావరకు ఆడియన్స్ డబల్ ఇస్మార్ట్ ఆకట్టుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మంచి సక్సెస్ అందుకోవడం ఖాయమంటూ. రామ్, పూరి జగన్నాథ్ ఇద్దరికీ ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో త్రో బ్యాక్ ఇస్తుందంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.