టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్లో ఎక్కువగా రీమిక్ సినిమాలను చేస్తూ ఒరిజినల్ కంటే అద్భుతంగా తెరకెక్కించి ఎంతోమంది ప్రశంసలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ జంటగా మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇది కూడా రైడ్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. అయితే రీమిక్ సినిమాలతో స్టార్ట్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హరీష్ శంకర్.. ఈసారి తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్‌తో మాత్రం ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆగస్ట్ 15న రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడింది. అయితే హరీష్ శంకర్ దర్శకుడుగానే కాదు ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
హరీష్ శంకర్ పలు సినిమాల్లో నటించాడట. ఇంతకీ హరీష్ శంకర్ నటించిన ఆ సినిమాల లిస్టు ఏంటో ఒకసారి చూద్దాం. తరుణ్, అనిత, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ నేను ఇష్టపడ్డాను. ఈ సినిమా 2003లో రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. హరిష్‌శంకర్ పలు సీన్స్ లో టక్కున మెరిశాడు. ఇక సినిమాకు హరిష్‌శంకర్ అసోసియేటివ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఇక ఈ సినిమాతో పాటు అందరివాడు, మొదటి, నేనింతే, సమ్మోహనం ఇలా ఎన్నో సినిమాల్లో కీరోల్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు హరీష్ శంకర్. ఓ పక్కన పలు సినిమాలో నటిస్తూనే.. మరోపక్క అసోసియేటివ్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. ఇక ఈయన నటించిన సినిమాల్లో నిన్నే ఇష్టపడ్డాను, వీడే, మొదటి సినిమాలకు అసోసియేటివ్ డైరెక్టర్ గా కూడా హరిష్‌శంకర్ వ్యవహరించడం విశేషం.
ఈ క్రమంలో దర్శకుడుగా మారెందుకు.. హరీష్‌శంకర్ ఎంతో శ్రమించాడు. మొదట రవితేజ హీరోగా తెరకెక్కిన షాక్.. సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు హరీష్. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోయిన.. ఈ మూవీలో హరీష్ శంకర్ టేకింగ్ నచ్చిన మాస్ మహారాజు రవితేజ.. మరోసారి మిరపకాయతో అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ సినిమాలను తెరకెక్కించి ఇండస్ట్రియల్ హిట్ కొట్టాడు. సాయి ధరంతేజ్తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అల్లు అర్జున్‌తో.. దువ్వాడ జగన్నాథం, వరుణ్ తేజ్‌తో గద్దెల కొండ గణేష్ ఇలా ఎన్నో సినిమాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ల లిస్టులో భాగమయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది.