ఇంటర్ కూడా చదవని ఈ అమ్మడు ఇప్పుడు వందల కోట్ల అధిపతి.. ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు అడుగుపెట్టి తమ సత్తా చాటుకుంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకునే దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా వాడుకుంటూ తమదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంటున్నారు. తమ అందం, నటన నైపుణ్యాలతో తల్లిదండ్రులకు మించిన వారసులుగా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం పైన చూస్తున్న ఫోటోలో ఉన్న అమ్మడు కూడా ఒకటి. స్కూల్ చదువు ఇంకా పూర్తికాకుండానే ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసింది. ప్రస్తుతం ఏమే ఓ పాన్ ఇండియన్ స్టార్ బ్యూటిగా మల్టీ మిలీనియ‌ర్‌గా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతుంది. ఇంతకీ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.. ఆమె అలియాభట్.

Know about Alia Bhatt's fitness and beauty secrets

ఇక ఆలియా తన ఇంటర్ కూడా పూర్తి చేయకుండానే ఇండస్ట్రీ లోకి వచ్చింది. మహేష్ భ‌ట్ నటవరసరాలిగా ఆలియా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చిన్నప్పుడే పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించింది. ఇక ఇండియలోనే అతిపెద్ద సినీ ఇండస్ట్రీగా కొనసాగుతున్న బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోవడం అంటే అది అంతా సులభమైన విష‌యం కాదు. ఈ విషయంలో ఆలియాను కచ్చితంగా ప్రశ్నించాలి. అలియా మొద‌ట ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్‌ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఎన్నో అవార్డును తన ఖాతాలో వేసుకొని పాన్ ఇండియా స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది. అయితే 12వ తరగతి పూర్తికాకుండానే చదువు మానేసిన ఈ అమ్మడు.. నటనపై ఇంట్రెస్ట్ తో సినిమా అవకాశాలను దక్కించుకుంది.

అలియాభట్ సినిమా ఓటీటీ రిలీజ్!

తన నటనకు ప్రేక్షకులు భ్రమరాధం పట్టారు. ఈ క్రమంలో వరుస అవకాశాలు రావడంతో ఇప్ప‌టివరకు ఎన్నో సినిమాల్లో నటించి కోట్లు సంపాదించింది. అయితే ఈమె స్టార్ కిడ్‌గా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని.. ప్రత్యేకతలు ఉన్నాయని..నెపోటిజం భావిలను కూడా అంగీకరించింది. దానికోసం స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆలియా.. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాహా అనే క్యూట్ పాప కూడా ఉంది. ఇక‌ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్‌ల‌లో ఒకరిగా దూసుకుపోతున్న ఆలియా.. పలు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తుంది. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమాతో సౌత్ ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ అమ్మడు ఇప్పటికే ఎన్నో ఖరీదైన ఇల్లు, అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. అలాగే ప‌లు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ సంపాదిస్తుంది. వేలకోట్ల అధిపతిగా మహారాణిలా దూసుకుపోతున్న అలియాకు శ్రీలంకలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.