ఏడాది బాక్స్ ఆఫీస్‌దగ్గర బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ 10 తెలుగు సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898ఏడి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయని దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు రూ.44.86 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్ కొల్లగొట్టిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన గుంటూరు కారం రూ.38.8 కోట్ల కలెక్షన్లతో రెండో స్థానంలో నిలిచింది.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ రూ.9.65 కోట్ల కలెక్షన్‌తో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజసజ్జ హీరోగా నటించిన మూవీ హనుమాన్. ఈ సినిమాకు ప్రేక్షకులు భ్రమరాదం పట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.7.97 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. వీటి తర్వాత తమిళ్ డబ్బింగ్ మూవీ భారతీయుడు 2 సినిమా టాలీవుడ్ లో రిలీజ్ అయ్యిన మొదటి రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.6.75 కోట్ల కలెక్షన్లను కలగట్టి 5వ స్థానాన్ని దక్కించుకుంది.
ఇక రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన డబ్బులు ఇస్మార్ట్ మూవీ తాజాగా అగస్ట్15న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు రూ.6.10 కోట్ల కలెక్షన్లు కొలగొట్టి 6వ స్థానాన్ని దక్కించుకుంది. అదే రోజున రిలీజ్ అయిన రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ రూ.4.56 కోట్ల కలెక్షన్‌తో ఏడోవ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి కానుకగా నాగార్జున నుంచి వచ్చిన నా సామిరంగ మూవీ రూ.4.30 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. తొమ్మిదో స్థానంలో రవితేజ హీరోగా నటించిన ఈగిల్ మూవీ రూ.3.93 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ.. రూ.3.8 కోట్ల కలెక్షన్ తో పదోవ స్థానంలో నిలిచింది.