తంగలాన్ మూవీలో మాళవిక మోహనన్ రోల్ రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.. కారణం ఏంటంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్. పా. రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో ప్రయాదగాత్మక సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన విక్రం.. తంగలాన్‌ కోసం మరింత రిస్క్ చేశాడు. ఈ సినిమా ఆగస్టు 15న‌ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజై తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ మూవీ.. కలెక్షన్ పరంగాను దూసుకుపోతుంది.

Rashmika Mandanna Height, Age, Family, Wiki & More

ఇందులో విక్రమ్ తో పాటు.. పార్వతి తిరువోతూ, మాళవిక మోహన‌న్, పశుపతి కీలక పాత్రలో నటించారు. అభిమానుల మధ్యన భారీ అంచనాలతో థియేటర్‌లోకి రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం మంచి వసూళ్లను రాబడుతుంది. మాస్ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమాకు.. ఫస్ట్ రోజు రూ.12.6 కోట్ల వసూళ్లు వచ్చాయి. అలాగే తంగలాన్‌కు కేవలం ఒక్క తమిళ్లోనే రూ.11 కోట్ల వసూళ్లు రావడం విశేషం. ఇక ఇప్పటికే కలెక్షన్ల పరంగా మంచి నెంబర్ తో రాణిస్తున్న తంగలాన్‌ ఎంతోమంది ప్రశంసలు అందుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో ఆర్తి పాత్రలో అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ మాళవిక మోహన్. ఇందులో పూర్తిగ నెగిటివ్ షేడ్స్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మాళవిక తన నటనతో ఆడియ‌న్స్‌ను భయపెట్టింది. అయితే మొదట ఈ సినిమాలో ఆర్తి పాత్ర కోసం నేషనల్ కృష్‌ను భావించారట డైరెక్టర్ పా. రంజిత్. మొదట్లో ఆర్తి పాత్రలో నటించేందుకు రష్మిక మందనని అప్రోచ్ కాగా.. డేట్స్ కేటాయించడంలో ఇబ్బందుల కారణంగా రష్మిక ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఆర్తి పాత్రలో రష్మిక నటించక‌ పోవడంతో ఆమె స్థానంలో మాళవిక మోహన‌న్ నటించిన మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.