ఇండియన్ 2 రిజల్ట్‌తో టెన్షన్‌లో తారక్ ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్ష‌న్‌లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 27న పాన్ ఇండియన్ లెవెల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత చాలా కాలం గ్యాప్‌తో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో శంక‌ర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా రిజల్ట్‌తో.. ఎన్టీఆర్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. భారతీయుడు 2కి, ఎన్టీఆర్ దేవరకు సంబంధం ఏంటి.. అసలు తారక్ ఫ్యాన్స్ టెన్షన్‌కు కారణం ఏంటో ఒకసారి చూద్దాం.

Bharateeyudu 2 trimmed heavily; Deets inside | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

భారతీయుడు 2 కి సంగీత దర్శకుడుగా అనిరుధ్‌ రవిచంద్రన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. కేవలం అనిరుధ్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. సంగీతంతోనే సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా భారీ పాపులారిటి దక్కించుకుని మ్యూజిక్ సెన్సేష‌న్‌గా మారిపోయాడు అనిరుద్. అయితే భారతీయుడు2 సినిమాలో మాత్రం అనిరుధ్‌ మ్యూజిక్ వర్కౌట్ కాలేదు. ఈ సినిమాకు అదే మైనస్ గా నిలిచిందని.. పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు మైనస్ పాయింట్ గా నిలిచిన అనిరుధ్‌ దేవర సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

Jr NTR Devara teaser to be out soon Composer Anirudh Ravichander drops hint - India Today

ఇప్పటికే దేవర సినిమాపై ప్రేక్షకుల బోలెడన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో ఇండియన్ 2 ఫ్లాప్‌తో దేవరలో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయో అనే సందేహాలు తారక్‌ అభిమానుల్లో వెల్లువెత్తుతున్నాయి. ఇక అనిరుధ్‌ మ్యూజిక్ డైరెక్షన్‌లో తెరకెక్కిన జైలర్, విక్రమ్ సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో కొరటాల శివ పట్టుబట్టి మరీ అనిరుధ్‌ను ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నాడు. అయితే భారతీయుడు 2 లో మ్యూజిక్ మైనస్ కావడంతో.. ఎన్టీఆర్ దేవర సినిమాకు అనిరుధ్‌ మ్యూజిక్ తో న్యాయం చేస్తాడా.. లేదా.. అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సినిమా నుంచి ఏదైనా మంచి మ్యూజికల్ అప్డేట్ మేకర్స్‌ రిలీజ్ చేస్తే బాగుంటుందని.. రిలీఫ్‌లా అనిపిస్తుంద‌ని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.