‘ కల్కి ‘ బ్లాక్‌బస్టర్ స‌క్స‌స్ వెన‌క ఆ ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్‌… ఇదేం ట్విస్ట్ సామి..?

ప్రభాస్, నాగ్ అశ్విన్‌ కాంబోలో తెర‌కెక్కిన కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధించి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా.. ప్రస్తుతం రూ.1000 కోట్ల రన్ వైపుగా దూసుకుపోతుంది. ఇలాంటి క్రమంలో ఈ సినిమా సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ వార్త‌లు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన కామెంట్స్.

Will Prabhas fulfill his aunt Shyamala Devi dream project | cinejosh.com

ఆమె మాట్లాడుతూ ప్రభాస్ కల్కి ఎంత సక్సెస్ సాధించినందుకు పవన్, తారక్ అభిమానులకు కృతజ్ఞతలు అంటూ వివరించింది. ప్రభాస్ అభిమానులు కూడా తారక్, పవన్ అభిమానులు సినిమాను ఓన్‌చేసుకుని థియేటర్లకు వచ్చి సినిమాను చూశారని.. అందుకే ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని భావిస్తున్నారు. కాగా తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పాల్గొని.. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుకు ఆ ఇద్దరు హీరోల అభిమానులే పరోక్షంగా సహాయం చేశారని చెప్పుకొచ్చింది.

Kalki 2898 AD: Prabhas Bhairava Avatar Will Make You Say Looking Like a Wow  Check His New Look

ఇక ప్రభాస్ కలిగే సినిమాతో చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత బాహుబలి 2 రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్ను సంగతి తెలిసిందే. దీని రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో ఏడాదిన్నర వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ వరస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీబిజీగా గడుతున్నాడు. ప్రస్తుతం ఏకంగా ప్రభాస్ చేతిలో ఏడు సినిమాలు ఉండడం విశేషం. అలాగే ప్రభాస్ ఎంచుకునే పాత్రలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తన సత్తా చాటుతున్నాడు.