కమలహాసన్ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్న చరణ్.. ఆ మూవీ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

లోకనాయకుడు కమలహాసన్ కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్ప‌రుచుకున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో తన నటనతో సత్తా చాటుకున్న కమల్.. ప్రస్తుతం భారతీయుడు 2తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో సుప్రీం య‌ష్కిన్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను భయపెట్టాడు. కేవలం కనిపించింది ఒకటి, రెండు సన్నివేశాల్లోనే అయినా తనదైన స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక కల్కి రెండో భాగంలో కమల్ హాసన్ పాత్రకు మరింత నడివి ఉంటుందని సమాచారం.

fuck yeah Ram Charan — Happy Birthday Kamal Haasan! ~ November. 7/ 1954

ఇలాంటి క్రమంలో కమల్ హాసన్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెటింట వైరల్ గా మారింది. కమలహాసన్ నటించిన ఓ సినిమాను రాంచరణ్ రీమేక్ చేయాలనుకుంటున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. కమలహాసన్ గతంలో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎప్పుడూ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ.. ప్రయోగాత్మక అడ్వెంచర్స్ సినిమాల్లోనే నటిస్తూ రాణిస్తున్నాడు. అనవసరైన ఫైట్లు, బిల్డప్, ఎలివేషన్ ఉన్న కథలకు అసలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. ఇలాంటి క్రమంలో కమల్ తన అభిమానుల సంఖ్య‌ను మరింతగా పెంచుకుంటున్నాడు.

Vichitra Sodarulu

ఇక రీసెంట్గా ప్రభాస్ కమలహాసన్ గొప్పదనం గురించి తెలియజేస్తూ నేను ఆయన అభిమానిని అంటూ ప్ర‌భాస్ గర్వంగా చెప్పుకొచ్ఆడు. ఈ క్ర‌మంలో రామ్ చరణ్ కూడా కమల్ హాసన్ అభిమాని అంటూ ఓ సందర్భంలో వివరించిన కామెంట్స్ నెటింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక చ‌ర‌ణ్ అదే సందర్భంలో మాటంలాడుతూ.. కమలహాసన్ నటించిన ఏ సినిమాలో రీమిక్స్ చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్న‌కు ” విచిత్ర సోదరులు ” సినిమాను రీమేక్‌ చేయాలని ఉంది అంటూ వివరించాడు. అలాగే పుష్పక విమానం సినిమా కూడా ఆయనకు ఎంతో ఇష్టమని.. అందులో మైమ్‌ ద్వారా సినిమా మొత్తాన్ని నడిపే విధానం నాకు చాలా నచ్చుతుందంటూ చెప్పుకొచ్చాడు. ఇలా కమలహాసన్ సినిమాలు రీమేక్‌ చేయాలనే కోరిక రామ్ చరణ్ లో కూడా ఉందంటూ వివరించాడు. ఇక చరణ్ గతంలో చేసిన ఈ కామెంట్స్ మ‌రోసారి వైరల్ అవుతున్నాయి.