టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరిష్ శంకర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోను సందడి చేసే ఈ డైరెక్టర్.. తన సినిమాల గురించి.. తన గురించి నెగటివ్ ప్రచారం చేసే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వాళ్ళ నోర్లుమూయిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు.. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా గతంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో.. హరిశంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాను కూడా ఇదే విధంగా నెగిటివ్ ప్రచారం చేస్తూ హైప్ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాదని.. సినిమా విషయాలను సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు. తాజాగా హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా దీనిపై రియాక్ట్ అయ్యాడు.
ఇలా ఫేక్ న్యూస్‌లు రాస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. రిలీజ్ దగ్గర పడుతుంది కదా ఏం పోస్ట్ చేసినా భయపడి తగ్గుతాడు అని ఒక ముసలి నక్క మళ్ళీ మళ్ళీ ఇలాంటి చెత్త ప్రచారాలు మొదలు పెడుతుంది.. దయచేసి ఇలాంటి అపోహలు పెట్టించుకోవద్దని మనవి అంటూ వివరించాడు. నా జోలికి వస్తే సినిమా రేపు రిలీజ్ అయినా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ వివరించాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ చేసిన పోస్ట్ నెటింట సంచలనంగా మారింది. అయితే హరీష్ శంకర్ ప్రత్యేకించి ఓ జర్నలిస్టును ఉద్దేశించి ఈ మాటలు అన్నాడని సమాచారం.