శంకర్‌తో సినిమాకు సిద్ధమవుతున్న తారక్.. ఈ కాంబో వర్కౌట్ అవుతుందా..?

తమిళ్ ఇండస్ట్రీలో దాదాపు 25 సంవత్సరాల నుంచి నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు శంకర్. త‌న సినిమాలో వైవిధ్య కథాంశం ఉండడమే కాదు.. ఆయన సినిమాలు ఒక విజువల్ వండర్ గా ఉంటాయ‌న్న సంగతి తెలిసిందే. అందుకే శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో మొదటి నుంచే మంచి అంచనాలు ఏర్పడతాయి. ఇక ప్రస్తుతం శంకర్ భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమాతో పాటూ రామ్ చరణ్ గేమ్ చేంజ‌ర్ సినిమాకు కూడా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2 రిలీజ్ హడావిడి పూర్తయిన వెంటనే శంకర్ గేమ్ చేంజ‌ర్‌పై ఫుల్ ఫోక‌స్ పెడతాడని టాక్.

Director Shankar receives legal notice from producer Aascar Ravichandran  for Anniyan remake

ఇక ఈ సినిమా కూడా ఈ సంవత్సరం చివర్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్స్ చేస్తున్నారట మేకర్స్. ఇక రాంచరణ్ నుంచి రానున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పటినుంచో వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో శంకర్‌కు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ నెటింట వైరల్ గా మారింది. ఇప్పటికే శంకర్ మరో స్క్రిప్ట్‌ కూడా సిద్ధం చేసుకున్నాడని.. ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించే ఆలోచనలు చేస్తున్నాడని సమాచారం. ఇక ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2, గేమ్ చేంజర్‌ సినిమాల పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా రిలీజై ఎలాంటి సక్సెస్ సాధిస్తాయో వేచి చూడాలి. ఇక‌ ఎన్టీఆర్ దేవర, వార్ 2 సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

N. T. Ramarao (Jr NTR) - Filmy Focus

ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయితే తర్వాత తారక్‌కు కాస్త ఫ్రీ టైం కూడా దొరుకుతుంది. కనుక అల్‌ టైం లో శంకర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తారక్ నటిస్తే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే ఇప్పుడున్న పాన్ ఇండియన్ డైరెక్టర్లంతా తమ సినిమాలతో బిజీగా గ‌డుపుతున్నారు. ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే పాన్ ఇండియన్ డైరెక్టర్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇలాంటి క్రమంలో ప్రశాంత్ నీల్‌తో సినిమా ఉంటుందని చెప్పినా అది ఎప్పుడు సెట్స్‌పైకి రానుందో ఎలాంటి క్లారిటీ లేదు. కనుక ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో.. శంకర్ తో సినిమా చేస్తేనే బెటర్ అని ఎన్టీఆర్ కూడా భావిస్తున్నట్లు సనిహిత వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ పైకి వస్తుందా.. లేదా.. తెలియాలంటే భారతీయుడు 2, గేమ్ చేంజ‌ర్‌ సినిమాలు రిలీజై రిజ‌ల్ట్‌ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.