సాయి పల్లవి టూ శ్రీ లీల.. మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల డ్రీం రోల్స్ ఇవే..!

ఇండస్ట్రీలో నటించే స్టార్ హీరో, హీరోయిన్ల నుంచి నటీమణుల వరకు ఎవరికైనా ఈ పాత్రలో నటిస్తే బాగుంటుందని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. అలా మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, రష్మిక, అనుపమ, రీతు వర్మ, శ్రీ లీల లాంటి వారికి కూడా డ్రీం రోల్స్ ఉన్నాయి. ఇంతకీ ఈ స్టార్ హీరోయిన్ల డ్రీమ్ రోల్స్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. లేడీ పవర్ స్టార్ గా రాణిస్తున్న నేషనల్ బ్యూటీ సాయి పల్లవి తన ఆందం, న‌ట‌న‌తో పాటు డ్యాన్స్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసింది. అయితే ఇప్పటివరకు సాయి పల్లవి నటించిన అన్ని సినిమాల్లోనూ ప్రేమికురాలిగా ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు విరాటపర్వంలోనూ ఆమె ఓ ప్రియురాలుగా కనిపించడం గమనార్హం. అయితే అమ్మడి డ్రీమ్ రోల్ అలాంటిది కాదట. ఓ కామెడీ పాత్రలో నటించాలని సాయి పల్లవి కోరికంటూ వెల్లడించింది.

Crazy: Hot Beauties busy with 1+1 - Telugu News - IndiaGlitz.com

ఇక నేషనల్ క్రష్‌ రష్మిక మందన వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్వరలో పుష్ప 2తో ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ ముద్దుగుమ్మ డ్రీమ్ రోల్ ఏంటో కూడా ఒక సందర్భంలో వివరించింది. రష్మికకు సౌందర్య అంటే చాలా ఇష్టమని.. చిన్నపటి నుంచి ఆమె సినిమాలే చూస్తూ పెరిగాను.. అలాగే ఆమె సినిమాల నుంచి చాలా నేర్చుకున్నాను.. అంటూ వివరించిందట. తన తండ్రి కూడా రష్మికను ఎప్పుడు సౌందర్య లాగా ఉంటావు అని చెబుతూ ఉంటారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సౌందర్య బయోపిక్ లో నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటించాలని కోరికగా ఉందంటూ వెల్ల‌డింఇచింది. ఇక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే సెన్సేషనల్ బ్యూటీగా మారింది శ్రీ లీల. ఒక్కసారిగా టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఎంత ఫాస్ట్ గా సక్సెస్ అందుకుందో అంతే ఫాస్ట్ గా ప్లాప్ లో ఎదుర్కొని డల్ అయింది.

Ritu Varma

ప్రస్తుతం మరోసారి తన కెరీర్ ను మంచి ఫామ్ లో బిల్డప్ చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉంది. ఇక క్ష‌లీల‌కు పాత తరం సినిమాలంటే చాలా ఇష్టమట. అందులో పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన సినిమాలంటే బాగా ఇష్టమని.. తను ఓ పల్లెటూరి నేపథ్యంలో తెర‌కెక్కే సినిమాల్లో అచ్చ తెలుగు ఆడపడుచులా.. పల్లెటూరు అమ్మాయిగా కనిపించాలని డ్రీమ్ ఉందని చెప్పుకొచ్చింది. అనుపమ పరమేశ్వరన్.. హోమ్లీ బ్యూటీగా నిన్న మొన్నటి వరకు పాపులారిటి ద‌క్కించుకున్న‌ ఈ ముద్దుగుమ్మ.. ఒక్కసారిగా టిల్లు స్క్వేర్ తో బోల్డ్ భామగా మెరిసింది. ఇక న‌కు నెగిటివ్ షేడ్స్‌ ఉన్న పాత్ర‌లో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. క్విన్‌లో కంగ‌నా లాంటి పాత్రలో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇక రీతు వర్మ పెళ్లి చూపులతో ఫేమస్ అయింది. కాగా చాలా సెలెక్ట్ సినిమాలను నటిస్తూ రానేస్తున్న ఈ అమ్మ‌డు గ్లామర్‌కు దూరంగా ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ యాక్షన్ సినిమాల్లో చేయాలని ఆశగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మల కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి వేచి చూడాలి.