నాగార్జున, అనుష్క కలిసి ఏకంగా ఇన్ని సినిమాల్లో నటించారా.. ఆ లిస్టు ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు నాగార్జున, అనుష్క కాంబోకు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు తెర‌కెక్కి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాయి. సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. కెరీర్ పరంగా తన మొదటి సినిమానే నాగార్జునతో నటించి మెప్పించింది. సూపర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోకపోయినా.. ఈ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది.

అలా నాగార్జున అనుష్క కలిసి ఇప్పటికీ ఏకంగా 10 సినిమాల్లో న‌టించారు ఆ సినిమాల లిస్ట్ ఏంటో.. ఎక‌పారి చూద్దాం. సూపర్, డాన్, రగడ, ఢ‌మరుకం, ఓం నమో వెంకటేశాయ సినిమాల్లో నాగార్జున‌, అనుష్క.. హీరో, హీరోయిన్లుగా నటించి మెప్పించారు. ఈ సినిమాలతో పాటు వీరిద్దరూ ఒక‌రి సినిమాల్లో ఒక‌రు గెస్ట్ రోల్‌లో కనిపించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఊపిరి సినిమాలో అనుష్క గెస్ట్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. కింగ్, కేడి, సోగ్గాడే చిన్నినాయన సినిమాలను అమ్మడు పలు సాంగ్స్ లో తళుక్కున మెరిసింది. ఇక సైజ్ జీరో సినిమాలో నాగార్జున.. అనుష్క కోసం గెస్ట్ రోల్ లో కనిపించాడు.

INSIDE STORY: Nagarjuna goes extra mile for Anushka

నాగార్జున, అనుష్క కాంబోలో ఇలా ఏకంగా మొత్తం పది సినిమాలు తెరకెక్కయి. ఇక నాగార్జున ప్రస్తుతం కుబేర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నా సామిరంగా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నాగ్‌ కుబేర సినిమాతో మళ్ళీ ఆ సక్సెస్ రిపీట్ చేసుకోవాలని క‌సితో ఉన్నాడు. ఈ సినిమా హిట్ కొడుతుందనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న శేఖర్ కమ్ముల సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకులను మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి. కాగా ప్ర‌స్తుతం అనుష్క చిన్న బ్రేక్ తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.