పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో రిలీజ్ అయింది. అంటే థియేటర్ల వద్ద ప్రేక్షకుల్లో ఉండే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పటికి ఆ ఫ్లాప్ సినిమాలు టీవీల్లో వస్తున్నాయంటే చాలు కళ్ళు అప్పగించేసి ఆ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి సినిమాల్లో గుడుంబా శంకర్ కూడా ఒకటి. అప్పట్లో ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవడంతోనో.. మరేదో కారణంతో సినిమా ఫ్లాప్ అయినా.. ఇప్పటికీ ఈ సినిమాను ఆడియన్స్ చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు.
బోర్ కొట్టినప్పుడల్లా ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇందులో పవన్ కళ్యాణ్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా ప్లాప్ అయినా స్క్రీన్ ప్లే కి ఆకర్షితుడైన ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల అదే స్క్రీన్ ప్లేని ఫాలో చేస్తూ.. ఒక పది సంవత్సరాలు పాటు తన కెరీర్‌ని కొనసాగించాడు. కాగా గుడుంబా శంకర్ సినిమాకు స్క్రీన్ ప్లే అందించింది పవన్ కళ్యాణ్ కావడం విశేషం. ఈ సినిమాలో ప్రతి పాట ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గత సినిమా ఖుషి కంటే కూడా ఈ సినిమాలో పాటలే ఫ్యాన్స్‌ను భారీ ఎత్తున ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కిల్లి కిల్లి సాంగ్ మాస్ ఆడియన్స్‌ను ఒక్క రేంజ్ లో కవ్వించింది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ తో పాటు చిందేసిన హాట్ బ్యూటీ కూడా ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.
ఇంతకీ ఈ అమ్మడు ఎవరు.. ఇప్పుడు ఎలా.. ఉంది. తర్వాత మరే తెలుగు సినిమాల్లోనూ ఈ అమ్మడు కనిపించలేదేంటి అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యే ఉంటాయి. ఈ ముద్దుగుమ్మ పేరు నతాన్య సింగ్. తెలుగులో ఏమే అతి తక్కువ సినిమాలోనే నటించింది. కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్గా రాణించింది, అక్కడ స్టార్ హీరోలుగా క్రేజ్ సంపాదించుకున్న ఉపేంద్ర, కిచ్చు సుదీప్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. 2008లో ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన బుద్ధిమంతా సినిమా ఈమెకు చివరి సినిమా. తర్వాత మళ్లీ ఈ అమ్మడు ఏ సినిమాలోను కనిపించలేదు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేసుకుంటున్నా ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ వేరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్ వేసేయండి.