వాణిశ్రీ నటించిన ఈ సినిమా ప్లాప్ అయినా.. అమ్మడు కట్టిన ఆర్గాండి చీరలు మాత్రం ఫుల్ ఫేమస్..!

సినిమాల్లో సెలబ్రెటీలు, హీరో, హీరోయిన్లు నటించే వస్త్రాలు కాస్త అందంగా కనిపిస్తే చాలు అలాంటి బట్టలే కొనుక్కోవాలని ఆడియ‌న్స్ అంతా ఆసక్తి చూపుతూ ఉంటారు. అలా కొన్ని కొన్ని సందర్భాల్లో వారు ధరించిన ఆ బట్టలకు డిమాండ్ చాలా పెరిగిపోతుంది. అస‌లు విష‌యానికి వ‌స్తే అలా 1974లో వాణిశ్రీ హీరోయిన్‌గా న‌టించిన చక్రవాకం సినిమాలో ఈ అమ్మడు కట్టిన చీరలకు కూడా ఆడవాళ్లు అదే రేంజ్‌లో ఫిదా అయిపోయారు. విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్‌లో పడవ నడిపే వ్యక్తిగా ఆయన కనిపించి ఆకట్టుకున్నాడు.

ఈ నదిలా నా హృదయం | Ee Nadila Naa Hrudayam | Song | Chakravakam (1974) -  YouTube

ఇదే సినిమాకు డి. రామానాయుడు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. అంతేకాదు ఫుల్ లెన్త్ రోల్ చేసి తనలోని నటన నైపుణ్యాన్ని కూడా చూపించాడు. చక్రవాకం పేరుతో కోడూరి కౌసల్య దేవి నవల రాయగా.. ఆ నవల బాగుండడంతో అదే కథను సినిమాగా తీశారు మేకర్స్. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. కానీ దీనిలో వాణిశ్రీ కట్టిన చీరలు ఆడవాళ్లకు బీభత్సంగా నచ్చేశాయి. ఆర్గండి (ఆరగండి) చీరలని వీటిని పిలుస్తూ ఉంటారు. బంగారు బాబు మూవీ తర్వాత గోల్డెన్ స్పాట్ కలర్ సారీలు, ఓణీలు బాగా హైలైట్ అయ్యాయి.

Chakravakam Telugu Movie Songs | Veena Lona Sad Video Song | Shobhan Babu |  Vanisri | - YouTube

చక్రవాకం సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో వాణిశ్రీ కట్టిన చీరలకు బాగా గ్రేస్ పెరిగింది. ఈ క్రమంలో విమల బాయిల్ చీరల్ని.. చక్రవాకం శారీస్‌ అంటూ బట్టల షాప్ల వాళ్లు చీరట‌ సేల్స్‌ను మరింతగా పెంచుకున్నారు. వాణిశ్రీ కట్టిన ఈ చీరలు అప్పట్లో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాయి. ఇక బంగారు కలలు సినిమా మాదిరిగానే చక్రవాకం సినిమా కాస్త బోరింగ్‌గా ఉండడంతో.. ఆడవాళ్లు కూడా సినిమాకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అయితే వాణిశ్రీ కట్టిన చీరల వల్ల మాత్రం సినిమా పేరు అప్పట్లో ఆడవారి నోట తెగ మారుమోగిపోయింది.