ఆయ‌న అలా కొట్టడంతో మూడు రోజులు ఫుల్ ఫీవర్.. ఎన్టీఆర్ పై స్టార్‌ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు అడుగుపెట్టి రాణిస్తున్నా.. ఇప్పటికీ కొంతమంది దివంగ‌త న‌టుల‌ పేర్లు అందరి మనసులో గుర్తుండిపోతాయి. అలాంటి వాళ్ళలో నందమూరి తారకరామారావు మొదటి వరుసలో ఉంటారు. ఆయన పేరు తరచూ ఇండస్ట్రీలో వైరల్ అవుతూనే ఉంటుంది. భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ చాలామంది కళ్ళముందే మెదులుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే దివంగత హీరో తారక రామారావు నటన గురించి.. ఆయన నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Olammi Tikkareginda Song - NTR, Jayaprada Superhit Video Song | Yamagola  Movie Video Songs - YouTube

రామారావు ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తో సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే అప్పట్లో రామారావు తో సాంగ్ షూట్ చేస్తే ఒళ్ళు హూనమైపోతుంని చాలామంది హీరోయిన్లు కామెంట్లు చేస్తూ ఉండేవారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ కు మాత్రం ఆయనతో డ్యాన్స్ చేయడం వల్ల ఏకంగా మూడు రోజులపాటు ఫుల్ ఫీవర్ వచ్చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ స్టార్ హీరోయిన్ వెల్లడించింది. అసలు విషయం ఏంటంటే స్టార్ హీరోయిన్ జయప్రద.. సీనియర్ ఎన్టీఆర్‌తో క‌లిసి ‘ యమగోల  ‘ మూవీలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

It's a tragedy that 3-time MP Jaya Prada becomes news only when men comment  on her

ఈ మూవీ అప్ప‌ట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ‘ ఓలమ్మి తిక్క రేగిందా ‘ సాంగ్ ఇప్పటికీ చాలామంది నోట వినిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో అయితే ఈ సాంగ్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సాంగ్ వచ్చిందంటే చాలు టీవీలో ముందు చేరిపోయి మరీ కనురెప్పలు కొట్టకుండా చూస్తారు ఆడియన్స్. అయితే ఈ సాంగ్ లో జయప్రదను రామారావు తరచు సీట్‌పై కొట్టే స్టెప్స్ ఉంటాయి. అలా ఎన్టీఆర్ జయప్రదను తరచు సీట్‌పై కొట్టడంతో ఆమెకు జ్వరం వచ్చేసిందట. ఏకంగా మూడు రోజులు జ్వరం తగ్గలేదని ఆమె స్వయంగా ఎన్‌టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో వివరించింది. ఇక ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి. దీంతో ఈ విషయం తెలిసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు.