బాలకృష్ణకు మాత్రమే సాధ్యమైన ఆ అరుదైన రికార్డ్.. ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణకు తెలుగు ఆడియన్స్ లో ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన‌ అవసరం లేదు. ప్రస్తుతం హ్యాట్రిక్‌ హీట్లతో టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న ఎన్టీఆర్.. తన 109వ సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్బికే 109 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఊరమాస్ అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట మేక‌ర్స్. కాగా దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు.

NBK 109 is a pan-Indian film – Here's the evidence | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఇక ఈ సినిమాకు కొల్లి బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య ప్రత్య‌ర్ధిగా.. పవర్ఫుల్ విలన్ గా బాబిడియోల్ కనిపించనన్నాడు. ఈ ఇద్దరి పాత్రలు నువ్వా, నేనా అనే విధంగా గట్టి పోటీతో ఉంటాయని తెలుస్తుంది. సరిగ్గా ఇంకా మూడు నెలలు అంటే అక్టోబర్ 10న దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే బాలయ్య వచ్చే నెలలో నటుడిగా ప‌రిచ‌య‌మై 50 ఏళ్లు పూర్తవుతుంది. తొలి సినిమా తాతమ్మ కలా రిలీజ్ అయి ఈ నెల 30 నాటికి అక్షరాల 50 ఏళ్ళు పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించ‌నున్నాడు బాల‌య్య‌.

ఒక హీరో కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎన్నాళ్ళు కెరీర్‌ను కొనసాగిస్తూ.. ఇప్పటికి స్టార్ హీరోగా సక్స‌స్ అందుకోవ‌డం.. యంగ్ హీరోల‌కు గ‌ట్టి పోటి ఇవ్వ‌డం అంటే అంత సులభమైన విషయం కాదు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు.. మ‌రే ఇండ‌స్ట్రీలోను అలాంటి రికార్డ్ కేవలం బాలకృష్ణ మాత్రమే సొంతం చేసుకున్నారు. అలా దేశంలోనే ఇది ఓ గొప్ప రికార్డ్ అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. మొత్తానికి అన్ని విధాల విజయవంతంగా కెరీర్‌ కొనసాగిస్తున్న బాలయ్య.. తన నెక్స్ట్ తరం వారసుడిగా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు.