చిరంజీవి ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్ అప్డేట్.. విశ్వంభర టీజర్ ఎప్పుడంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ స్టార్ హీరోగా నెంబర్ 1 పొజిషన్లో దూసుకుపోతున్నాడు చిరంజీవి. అదే యంగ్ లుక్ తో కుర్ర హీరోలకు గట్టి పోటీ చేస్తూ వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్న చిరంజీవి.. కొంతకాలం గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తర్వాత వరస సినిమాలో నటిస్తున్న చిరంజీవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ క్ర‌మంలో చివరిగా తెర‌కెక్కిన భోళాశంకర్ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఎలాగైనా చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభరతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవాలని కసిత ప్రయత్నిస్తున్నాడు.Chiranjeevi announces release date of 'Vishwambhara', shares new poster - India Today

ప్రస్తుతం బింబిసారా ఫేమ్ మల్లిడి వ‌శిష్టా డైరెక్షన్ లో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే మేకర్స్ రిలీజ్ చేయనున్నారు అని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా టీజర్ ను ఈ నెల చివర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అదే విధంగా సెప్టెంబర్ లో సినిమా ట్రైలర్ను వదిలి.. మరోసారి సినిమా రిలీజ్ కి ముందు సెకండ్ ట్రైలర్‌ కూడా వదిలేలా సన్నాహాలు చేస్తున్నారట.

Video: Megastar Chiranjeevi welcomes Trisha as she joins cast of ' Vishwambhara' - India Today

అయితే ఈ సినిమా సోషియ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి డిఫరెంట్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ డైరెక్టర్ వర్సెస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో.. ఇక దీని ముందు బింబిసారా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి.. రికార్డులను క్రియేట్ చేసిన వశిష్ట చిరంజీవి విశ్వంభరతో ఎలాంటి రికార్డులు అందిస్తాడో వేచి చూడాలి.