కమల్ హాసన్ కెరీర్‌లోనే ఈ 5 సినిమాలు చాలా స్పెషల్ .. ఆ సినిమాలు ఇవే..!

లోక నాయకుడు కమలహాసన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కమల్ హాసన్.. తమిళ్లోను స్టార్ హీరోగా క్రేజ్‌ను సంపాదించుకొని దూసుకుపోతున్నాడు. ఈ ఏజ్ లోను వరుస‌ సినిమా ఆఫర్లను అందుకుంటూ తన సత్తా చాటుతున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన కల్కి 2898 ఏడిలో సుప్రీమ్ యష్కిన్ పాత్రలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్లో కమల్ హాసన్ విశ్వరూపం మరింతగా తెలియనుంది.

Danza Sagara Sangamam Kamal

ఈ క్ర‌మంలో కమల్ హీరోగా భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానంది. దీంతో సినిమా ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు మూవీ టీం. ఇక కమల్ హాసన్ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించినా ఆయన నటించిన అన్ని సినిమాల్లో ఈ 5 సినిమాలు ఎప్పటికీ ఎంతో స్పెషల్గా నిలిచాయి. అందులో సాగ‌ర‌సంఘమం, స్వాతిముత్యం, భారతీయుడు, దశావతారం, విక్రమ్ సినిమాలు కెరీర్ మొత్తంలోనే ఎప్పుడు గుర్తుండిపోయే స్పెషల్ సినిమాలుగా మిగిలిపోయాయి.

Bharateeyudu 2: Film to resume in February

ఇక ఇప్పుడు భారతీయుడు సీక్వెల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు కమల్‌హాసన్. 1996లో వచ్చిన మొదటి భాగం భారతీయుడు సినిమా సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వల్ గా మరోసారి ఇండియన్ 2 రావడం అనేది ప్రేక్షకుల్లా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రిలీజై ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన విధంగా చాలా గ్రాండియర్ తో ఈ సినిమా ఉండబోతుందని టాక్. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.