ప్రభాస్ ‘ స్పిరిట్ ‘ కోసం హాలీవుడ్ విలన్‌.. రికార్డ్‌లు తుక్కుతుక్కే… రాస్కోండి..?

ప్రభాస్ కల్కి 2898 ఏడీ ఆడియన్స్ లో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రూ.1000 కోట్ల రన్ వైపు దూసుకుపోతున్న ఈ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి స‌త్త చాటింది. ఇప్పటికి సినిమాను ఫ్యాన్స్ థియేటర్లో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా కంటే ముందే పాన్‌ సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. కల్కి 2898ఏడితో పాన్ వ‌ర‌ల్డ్‌ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన స్పిరిట్ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో తెర‌కెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

K-drama Star Ma Dong-Seok To Make Telugu Debut In Prabhas' Spirit: Report |  Times Now

ఇక ఈ సినిమా రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. టి సురేష్, భద్రకాళి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్క‌నుంది. ఈ సినిమాలో విలన్‌గా హాలీవుడ్ స్టార్ విలన్.. లీ డాంగ్ సిక్ ను రంగంలోకి దింపేందుకు సిద్ధమయ్యాడ‌ట‌ సందీప్. ఇప్పటికే అత‌నితో సంప్రదింపులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ట్రైన్ టూ బూసా,న్ మార్వెల్ సిరీస్ ఎటర్నల్ సినిమాల ద్వారా సౌత్ కొరియన్ యాక్టర్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు లీ డాంగ్‌. ఈ సినిమా కథ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండనుందని.. అందుకే హాలీవుడ్ నటుల‌పై దృష్టి సారించినట్లు తెలుస్తుంది.

Spirit - IMDb

ఇందులో ప్రభాస్ రెండు భిన్న కోణాల్లో కనిపించనున్నాడట. అందులో ఒకటి రఫ్ అండ్ ర‌గడ్‌గా, రెండోది స్టైలిష్ లుక్ లో ప్రేక్షకులకు కనిపించనున్నాడట. ఇక ఈ రెండు గెటప్పుల్లో ఒకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. అయితే ఈ రెండు లుక్‌ల‌లో ప్ర‌భాస్ పోలీస్ క్యారెక్ట‌ర్ ఏది అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇందులో ప్రభాస్ డ్యూవెల్ రోల్ లేదా.. ఒకే పాత్ర రెండు ఫార్మాలు ఉంటాయా అనే అంశంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి రానుందని టాక్.