టిల్లు 3.0లో హీరోయిన్‌గా.. నేహా – అనుపమనే మించిపోయే ఫిగర్.. నరాలు జివ్వుమనాల్సిందే..!

టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా, నేహ శెట్టి హీరోయిన్‌గా విమ‌ల్‌ కృష్ణ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన డీజే టిల్లు ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్లో బాగా కనెక్ట్ అయింది. దీంతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇందులో అనుపమ హీరోయిన్గా నటించింది. మ‌ల్లిక్ రామ్‌ డైరెక్షన్‌లో వ‌చ్చిన ఈ సినిమా మొదట్లో కాస్త తక్కువ కలెక్షన్లు రాబట్టినా.. తర్వాత మంచి సక్సెస్ సాధించి మరోసారి రికార్డ్ సృష్టించింది. ఇలా టిల్లు సిరీస్ లు వ‌రుస‌గా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌లు అవ్వడంతో.. దీనికి కంటిన్యూ చేస్తూ.. టిల్లు 3.0 తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Tillu Cube Movie (2024) Cast, OTT, Release Date - Cine Fellows

ఇక మొదటి భాగంలో రాధికగా నేహా శెట్టి నటించిన సంగతి తెలిసిందే. ఆమె పేరును ఇప్పటికీ చాలామంది వాడుతూనే ఉన్నారు. టిల్లు స్క్వేర్ లో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్.. లిల్లీ రోల్ ను ప్లే చేసింది. దీంతో అమ్మడికి రాధిక 2.0 అనే ఇమేజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు నేహా, అనుపమ అందాన్ని మించిపోయి ఓ ఫిగర్ను 3.0 కోసం రంగంలోకి దింపుతున్నారని.. టిల్లు క్యూబ్ కోసం రాధిక 3.0 గా టాలీవుడ్ లక్కీ బ్యూటీ నటిస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ అమ్మడు ఎవరు అనుకుంటున్నారా..? ఆమె ప్రియాంక జువాల్క‌ర్‌. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు సక్సెస్ సాధించడం అంటే అంత సాధారణ విషయం కాదు. అలాంటిది ప్రియాంక జువాల్క‌ర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమా టాక్సీవాలాతోనే మంచి సక్సెస్ అందుకుంది.

Priyanka Jawalkar (@jawalkar) • Instagram photos and videos

ఇదే ఈ సినిమా తర్వాత వచ్చిన రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీతో మరోసారి స‌క్స‌స్ త‌న ఖాతాలో వేసుకుంది. అయితే రెండు చిన్న సినిమాలు కావడంతో ప్రియాంకకు ఊహించిన సక్సెస్ రాలేదు. ఇలాంటి క్రమంలో ఈసారి మాత్రం అమ్మడు జాక్‌పాట్ ఆఫర్ కొట్టేసింది అంటూ.. టిల్లు స్క్వేర్ లో కొద్ది క్షణాలు మాత్రమే మెరిసిన ఈ అమ్మడు.. టిల్లు క్యూబ్ లో రాధిక 3.0 గా కనిపించనిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్త నిజమైతే ముద్దుగుమ్మను రాధిక 3.0గా అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం సిద్దు జొన్న‌లగడ్డ వేరే సినిమా పనుల‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ సినిమా తర్వాత టిల్లు క్యూబ్ తెరకెక్కనుంది.