డల్లాస్‌లో టాలీవుడ్ కొత్త సినిమా అడిష‌న్స్‌.. వీఎన్‌. ఆదిత్య సినిమాకు క్రేజ్ కేక పుట్టించిందే..?

ద‌ర్శ‌కుడు వీఎన్‌. ఆదిత్య గురించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. మ‌న‌సంతా నువ్వే, శ్రీరామ్‌, నాగార్జున‌తో నేనున్నాను లాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో త‌న స్పెషాలిటీ చాటుకున్నారు. ఆ రోజుల్లో మ‌న‌సంతా నువ్వే సినిమా తెలుగు కుర్ర‌కారు గుండెల్లో ఎలా గిలిగింత‌లు పెట్టిందో చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌ట‌కీ అదో క‌ల్ట్ సినిమా.. ఆదిత్య డైరెక్ష‌న్‌లో సినిమా వ‌స్తుందంటే చాలు మంచి ఫీల్‌గుడ్ ల‌వ్‌స్టోరీ లేదా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఉన్న సందేశాత్మ‌క సినిమాయే అవుతుంద‌న్న న‌మ్మ‌కాలు ఉంటాయి.

ఈ క్ర‌మంలోనే ఆదిత్య డైరెక్ట్ చేసిన కొత్త సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. త‌న కొత్త సినిమాల ప‌రంప‌ర‌లో ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే కొత్త సినిమాపై అమెరికాలోని డ‌ల్లాస్‌లో ప్ర‌క‌ట‌న చేశారు.
ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా.. వీఎన్‌ ఆదిత్య డైరెక్షన్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరం లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో కొత్త సినిమాపై ప్రకటన చేశారు. వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో వచ్చే ఈ కొత్త మూవీ నిర్మాణం డల్లాస్‌లో జరగనుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా కోసం ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు మాత్రమే కాక.. విదేశీయులు అనగా అమెరికన్స్‌, స్పానిష్‌ పీపుల్‌, ఆఫ్రికన్స్‌, యూరోపియన్స్‌, ఏషియన్స్‌, ఇండియన్స్‌.. మరీ ముఖ్యంగా తమిళ్‌, కన్నడ, తెలుగు వారు భారీ సంఖ్యలో పాల్గోవ‌డం విశేషం. త‌మ సినిమా అడిష‌న్స్‌కు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావ‌డం ప‌ట్ల ద‌ర్శ‌కుడు ఆదిత్య హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇక 2000వ టైంలో మ‌న‌సంతా నువ్వే సినిమా చూసి అమెరికాలో ఉన్న‌త స్థానాల్లో ఉన్న‌వారంద‌రు ఆదిత్య‌ను క‌లిసి ఆ సినిమా త‌మ‌పై ఎలాంటి ప్ర‌భావం చూపించిందో చెప్పారు. దేశం కాని దేశంలో ఓ తెలుగు సినిమా ఆడిషన్ కి ఇంతటి రెస్పాండ్ రావడానికి ద‌ర్శ‌కుడు ఆదిత్య క్రియేటివిటీపై ఉన్న అంచ‌నాలే కార‌ణం.

అలాగే పై కార్య‌క్ర‌మం ఇంత స‌క్సెస్ కావ‌డానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్‌కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్ల‌కు, శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్‌చార్జ్ మమత కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండికి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి ధన్యవాదాలు తెలిపారు.