కూతురికి ఆ హీరోయిన్ పేరు పెట్టుకున్న మ‌నోజ్‌… ఎవ‌రా హీరోయిన్‌..?

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. హీరోగా కరీర్ ప్రారంభించి న‌ట‌న‌లో తనదైన ముద్ర వేసుకున్న మనోజ్.. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకుని గతేడాది గ్రాండ్‌గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మౌనికకు గతంలోనే ఒక కొడుకు ఉండగా.. ఏప్రిల్ లో ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

కానీ పాప ఫేస్‌ను మాత్రం రివీల్ చేయకుండా దాచారు. తాజాగా మంచు మనోస్ కూతురి బారసాల వేడుకలను నిర్వహించిన ఈ జంట‌ పాపకు పేరు పెట్టారు. ఈ విషయాన్ని మనోజ్‌ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. అలాగే కొన్ని ఫోటోలను కూడా ఆయన షేర్ చేస్తూ.. మీ అందరి ఆశీస్సులతో, శివయ్య బ్లెస్సింగ్స్ తో మేము మా కూతురికి దేవసేన శోభ ఎమ్‌ఎమ్‌ అని పేరు పెట్టామని వెల్లడించాడు. అలాగే తన నిక్ నేమ్ పులి ఎమ్‌ఎమ్‌. మా పాప పేరు అధికారికంగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉన్నామంటూ రాసుకొచ్చాడు.

లార్డ్ శివ భక్తుడిగా.. అతని కుటుంబం నుంచి ఓ పేరును ఎంచుకున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య దేవసేన. ఆమె మధ్యలోని పేరు శోభ కలిపి నా కూతురికి పెట్టాము అంటూ ఓ నోట్‌ను షేర్ చేసుకున్నాడు. అయితే బాహుబలి మూవీ లో హీరోయిన్ అనుష్క దేవసేన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అమ్మడి న‌ట‌న‌కు కోట్లాదిమంది ఫిదా అయ్యారు. అయితే అనుష్క పేరును మ‌నోజ్ పేరుగా పెట్టడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఈ విషయం తెలిసిన కొందరు ఈ సినిమాలో అమ్మడి నటనను మెచ్చి.. తన కూతురికి ఈ పేరైతే సరిపోతుందని పెట్టినట్టు ఉన్నాడు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.