మృణాల్ కు ఆ సినిమా అంటే అంత పిచ్చా.. ఇప్పటివరకు ఒక్కరోజు కూడా చూడడం మిస్ కాలేదా..?

యంగ్ బ్యూటీ మృణాల్‌ తాజాగా కల్కి 2898 ఏడిలో గెస్ట్ రోల్ లో మెరిసిన సంగతి తెలిసిందే. సీతారామమ్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. అచ్చ తెలుగు ఆడపిల్లల తన కట్టుబొట్టు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటన, అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాతో కుర్రాళ్ళ కలలు రాకుమారిగా మారింది. దీంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇందులో భాగంగా నాచురల్ స్టార్ నాని.. హాయ్ నాన్న సినిమాలో నటించి మెప్పించింది.

Hi Nanna Telugu Glimpse | Nani | Mrunal Thakur | Shouryuv | Hesham Abdul  Wahab | Sanu John Varghese

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు.. అమ్మడికి మరింత మార్కెట్‌ పెంచింది. తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో నటించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలో తాజాగా మృణాల్‌ తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకున్న స్టోరీ నెటింట వైరల్ గా మారింది. ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టాలో అభిమానులకు దగ్గరగా ఉండే మృణాల్‌ తన పర్సనల్ తో పాటు సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది.

అలా ట్రెండీ ఆవుట్‌ఫిట్‌లు ధరిస్తూ.. గ్లామర్ షోలతో నెటిజ‌న్లను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న మృణాల్‌.. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో హాయ్ నాన్న ఫేవరెట్ సినిమా.. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా అంటూ వివరించింది. ఇది చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా నేను ఈ సినిమాని చూడడం మిస్ కాలేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్‌ చేసిన పోస్ట్ వైరల్ అవ్వడంతో.. అభిమానులంతా ఈ సినిమా అంటే మరీ అంత పిచ్చా అంటూ ఆశ్చర్యపోతున్నారు.