ఎట్టకేలకు తను అనుకున్నది సాధించిన సాయి పల్లవి.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

ఫిదా సినిమాతో సాయి పల్లవి టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అచ్చ‌ తెలుగు ఆడపిల్ల‌లా.. తెలంగాణ యాసలో అదరగొట్టింది. తన అందం, నటనతో పాటు డ్యాన్స్ లోనూ ఆకట్టుకుంది. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎలాంటి స్టార్ హీరో సినిమాల్లో అవకాశం వచ్చిన తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే నటిస్తుంది. ఈ క్రమంలో చాలా కాలం సినిమాలకు అమ్మడు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

Congrats Dr Sai Pallavi! | Sai Pallavi | graduation | doctor | premam | kali | actress | malayalam movie | Entertainment News | Movie News | Film News

ఇక తాజాగా మళ్లీ సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం నాగ‌ చైతన్య సరసన తాండేల్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20న థియేటర్స్ లో రానుంది. అలాగే ఇతర భాషల్లోనూ పలు సినిమాల్లో బిజీగా ఉంది సాయి పల్లవి. ఇక‌ అమ్మడి లైఫ్ డ్రీమ్ తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఈ నేచురల్ బ్యూటీ పాల్గొన్న అన్ని ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. రియల్ లైఫ్ లో డాక్టర్ చదువుకొవాల‌న‌ది త‌న కల‌ అంటూ చెప్పుకోస్తూనే ఉంది. ఇక ఎట్టకేలకు తను అనుకున్నది సాధించింది.

Sai Pallavi FC™ on X: "Happy DOCTOR'S DAY to all the doctors out there n thank u for ur Unconditional Service to mankind ♥️ Happy #DoctorsDay maa Bangaram @Sai_Pallavi92 🤍 #SaiPallavi https://t.co/ZSvsdYnro9" /

ఈ క్ర‌మంలో అమ్మ‌డి గ్రాడ్యూవేష‌న్‌ వీడియో ఒక‌టి తెగ వైరల్ గా మారింది. స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసిన ఈ అమ్మడు.. రెండు రోజుల క్రితం జార్జియాలోని ఎంబిబిఎస్ గ్రాడ్యుకేషన్ పట్టా అందుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను అభిమానుల తెగ ట్రెండ్ చేస్తూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఎట్టకేలకు నటనలోనే కాదు.. చదువులోనూ సాయి ప‌ల్ల‌వి తన సత్తా చాటుకుందంటూ.. ఇలాంటి అమ్మాయిలు ఇండస్ట్రీలో దొరకడం చాలా రేర్ అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇకపై సాయి పల్లవి సినిమాలకు దూరం అవుతుందా..? కేవ‌లం డాక్టర్గా తన వృత్తి కొనసాగిస్తుందా..? అంటూ త‌మ‌ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.