ఆ స్టార్ హీరోయిన్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడిగిన వెంకటేష్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

తెలుగు సీనియర్ హీరో వెంకటేష్.. కలియుగ పాండవులు సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత వరుస సినిమాలో నటించే అవకాశాలను దక్కించుకుంటూ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్.. దాదాపు టాలీవుడ్‌ డైరెక్టర్స్, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరితోను ఎంతో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకున్నాడు. అస‌లు నెగెటివిటీనే లేని హీరోల్లో మొదటి పేరు వెంకటేష్ ది వినిపిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక వెంకటేష్ స‌ర‌స‌న ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ హీరోయిన్ల అందరిలో సౌందర్య కూడా ఒకటి.

Watch Pavithra Bandham (Telugu) Full Movie Online | Sun NXT

వెంకటేష్, సౌందర్య కలిసి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఇలాంటి క్రమంలో సాధారణంగానే హీరో, హీరోయిన్ల మధ్యన పుకార్లు వస్తూ ఉంటాయి. అలా వెంకటేష్, సౌందర్య మధ్యన కూడా ఎన్నో వార్తలు వినిపించాయి. కాగా ఒకానొక సమయంలో వెంకటేష్.. సౌందర్య కాలు కూడా పట్టుకోవాల్సి వచ్చిందని.. స్వయంగా ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. వెంకటేష్ మాట్లాడుతూ.. పవిత్ర బంధం సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

సౌందర్య కాళ్ళ మీద పడ్డాను: Venkatesh Shares UNKNOWN Incident About Pavitra  Bandham Movie

సినిమా రిలీజ్ టైం లో సౌందర్య కాళ్ళను తాను పట్టుకునే సన్నివేశం ఉన్న‌ ఆ పోస్టర్ను సినిమా టీం రిలీజ్ చేశారని.. తర్వాత చాలామంది నన్ను భయపెట్టడానికి ప్రయత్నించారంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి సన్నివేశాలు చేస్తే సినిమా అవకాశాలు రావ అంటూ భయపెట్టిన కథ బాగుంటే జన‌మే వస్తారని నమ్మకంతో తను ఉండేవాడినని.. అనుకున్నట్టుగానే పవిత్ర బంధం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిందంటూ వెంకటేష్ వివరించాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.