టాలీవుడ్ నాచురల్ స్టార్ నానికి ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సహజ నటనతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న నాని.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే నాని ఒకప్పటి సినిమాలకు రొమాన్స్, కిస్ సీన్స్ లాంటి ఎపిసోడ్లకు తావే ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లుగా.. నాని నటిస్తున్న చాలా సినిమాల్లో ఖచ్చితంగా కిస్సింగ్ సీన్స్ ఉంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో బాగా హైలైట్ అయిన సినిమా శ్యామ్‌సింగరాయ్.
కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్గా సాయి పల్లవి కూడా నటించింది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా 2021లో రిలీజ్ మంచి సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో నాని, కృతి శెట్టి మధ్య వచ్చే హాట్ లిప్ లాక్ సీన్ అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించాయో చెప్పనవసరం లేదు. తెలుగులో చేసిన రెండో సినిమాకే కృతి రొమాంటిక్ సీన్స్ రెచ్చిపోవడంతో.. సినీ అభిమానులంతా ఆశ్చర్యపోయారు.
అలాగే నాని కూడా గతంలో ఎప్పుడూ అలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించింది లేదు. అయితే ఈ సన్నివేశం చేసేటప్పుడు నానికి తన నెక్స్ట్ జన్మ గుర్తుకొస్తుంది. కథలో భాగంగానే డైరెక్టర్ రొమాంటిక్ సీన్స్ పెట్టారు. దీంతో నాని ఈ సీన్ చేయ్యక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కుర్ర హీరొయిన్ కృతి శెట్టి అయితే.. నానితో లిప్ కిస్ కేసం షాకింగ్ కండిషన్ పెట్టిందంటూ తెలుస్తుంది. షూట్ చేసి సమయంలో డైరెక్టర్, కెమెరామ్యాన్ తప్ప అక్కడ మరి ఎవరు ఉండకూడదు.. అలా అయితేనే ఆ సన్నివేశాల్లో నటిస్తా అని చెప్పిందట. మొదట పెట్టిన కండిషన్‌కు డైరెక్టర్ ఆలోచించినా.. తర్వాత కృతి ప్రైవసీని అర్థం చేసుకుని ఆమెకు ఆ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.