హేమ డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ షాకింగ్ రిజల్ట్.. నేను నిర్దోషి అంటూ మంచు విష్ణుకు హేమ సంచలన లేఖ..

గత రెండు నెలల‌ క్రితం బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి దుమారం రేపుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ నటి హేమ పేరు తెగ వైరల్ గా మారింది. ఆమె ఆ రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడింది అంటూ అఫీషియల్ గా ప్రకటించడం మరింత దూరం రేపింది. ఆమె డ్రగ్స్ సేవించి టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ వచ్చింది అంటూ పోలీసులు షాకింగ్ నోటీసులు కూడా జారీ చేశారు. తర్వాత విచారణ కోసం వచ్చిన హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే కొంతకాలానికి బెయిల్ తో బయటకు వచ్చేసింది స్టార్ బ్యూటీ. కాగా పోలీసులు ఈమెను అరెస్ట్ చేసిన వెంటనే వచ్చిన ఆరోపణలను చూసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. ‘ మా ‘ హేమా ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు.

తాజాగా ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు సంచ‌ల‌న లేఖ‌ను అందించింది. అంతే కాదు ‘ మా ‘ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి.. స్వయంగా తానే ఆ లెటర్ ఇస్తూ.. దాంతో పాట్టే డ్రగ్స్ టెస్ట్‌కు సంబంధించిన తన రిపోర్టు కూడా అతనికి అందజేసింది. అందులో హేమ స్పందిస్తూ నేను సుమారు 10 ఏళ్ల నుంచి మా అసోసియేషన్ లో సభ్యురాలుగా ఉన్నాను. కానీ తనకు ఎలాంటిషోకాజ్ నోటీసులు జారీ చేయకుండా.. కనీసం ఏం జరిగిందో వివరణ అడగకుండా.. ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయంగా అనిపిస్తుంది. బెంగళూరు రేవ్‌ పార్టీ ఉదాంతంలో నాపై జరిగిన దుష్ప్రభావాలను బట్టి నన్ను ‘ మా ‘ నుంచి తొలగించడం అన్యాయం. ‘ మా ‘ బైలాస్ ప్రకారం నాకు ముందు షోకేస్ నోటీసులు అందించాలి. కానీ అలాంటివేమీ నాకు అందలేదు.

షోకోజ్ నోటీసులు ఇచ్చిన వివరణ సరైనది కానప్పుడు.. ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎలాంటి షాకాజ్ నోట్స్ ఇవ్వకుండా.. మా నుంచి నన్ను తీసేయడం చాలా అన్యాయం. తప్పు కూడా. ఇటీవలే నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నా. అందులో నాకు నెగటివ్ వచ్చింది. త్వరలోనే పోలీసులు జరిపిన పరీక్షలు వివరాలు బయటకి అనౌన్స్ చేస్తారు. అందుకని మళ్లీ స‌ మా ‘ లో నా సభ్యత్వాన్ని కొనసాగించండి. ఎందుకంటే డ్రగ్స్ కేసు విషయంలో నాకు మా సపోర్ట్ కావాలి. అని ఆ లేఖలో హేమా వివరించింది. కాగా హేమ లేఖను అందుకున్న మంచి విష్ణు.. దాన్ని ఈ అడ్వైజర్‌ కమిటీకి అందించి.. తర్వాత మా కమిటీ లో చర్చించి ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ఈ వార్త నెటింట‌ వైరల్ గా మారింది.