ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.. జాక్పాట్ ఛాన్స్ కొట్టేసిందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ రష్మిక మందన్నా.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఏ స్టార్ హీరోకి చూసిన రష్మిక మందన్నానే కావాల్సి వస్తుంది .ఈ క్రమంలోనే ఆమెకు ఆఫర్లు సైతం భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి .
కాగా నేషనల్ క్రష్ పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో ఆమె మరింత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ చేసుకుంటుంది అంటూ ఫ్యాన్స్ సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త వైరల్ గా మారింది . రామ్ చరణ్ సినిమాలో కూడా రష్మిక మందన్నా హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
బుచ్చిబాబు సన దర్శకత్వంలో రాంచరణ్ నటించబోయే సినిమాలో రష్మిక మందన్నా సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందట. ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా జాన్వి కపూర్ కనిపించబోతుంది . ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది జాన్వి కపూర్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . ఇప్పుడు అదే రేంజ్ లో రష్మిక మందన్నా సైతం రెమ్యూనరేషన్ తీసుకుంటుందట . ఈ సినిమా మొత్తం ఫుల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఈ సినిమాతో రష్మిక మందన్నా ఎలాంటి హిట్ అందుకుంటుందో..??