ఆ విషయంలో బన్నీ కన్నా రామ్ చరణ్ గొప్ప.. మరోసారి గెలుక్కుంటున్న ఫ్యాన్స్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫాన్స్ మధ్య వార్ ఎలా పిక్స్ కి చేరిందో మనం చూసాం. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ తో అల్లు అర్జున్ కి అస్సలు పోలికలేదని అల్లు అర్జున్ సినిమాలు అంతగా ఆడవు అని ..ఆయన అంత స్టైలిష్ స్టార్ మాత్రమే అని రామ్ చరణ్ నటనతో అవార్డులు అందుకుంటాడు అని.. రకరకాలుగా ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరోలను పొగిడేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి అదే విషయాలను ట్రెండ్ చేస్తున్నారు రామ్ చరణ్ అభిమానులు .

రామ్ చరణ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరో అని ఆయన సపోర్ట్ చేసిన జనసేన పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది అని .. బన్నీ సపోర్ట్ చేసిన వైసిపి దారుణాతి దారుణంగా ఓడిపోయింది అని .. ఈ ఒక్క విషయం చాలు జనాలలో బన్నీకి ఎలాంటి క్రేజ్ ఉంది రామ్ చరణ్ కి ఎలాంటి ఫాలోయింగ్ ఉంది అనే విషయంలో అంటూ దారుణాతి దారుణంగా బన్నీని ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఇప్పుడు బన్నీ పుష్ప2 సినిమాపై కూడా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు .

బన్నీ పుష్ప2 ఫ్లాప్ అవుతుంది అని ముందుగానే జోష్యం చెప్పేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది. కాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా ఆగస్టు 15వ తేదీ గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తీవ్రస్థాయిలో కష్టపడ్డారు . ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తుంది..!!