అరియానా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.. యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపే సంపాదించుకుంది . అయితే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత తనదైన స్ట్రాటజీతో గేమ్ ఆడి కష్టపడి టాప్ ఫైవ్ లో చేరుకొని అందరి దృష్టిని ఆకర్షించింది . ఆ తర్వాత అరియానా.. సోహెల్ పేర్లు ఎలా మారుమ్రోగిపోయాయో మనం చూసిందే. అంతేకాదు కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ తర్వాత అరియానాకు బోల్డ్ బ్యూటీ అంటూ ట్యాగ్ వేశారు జనాలు.
ఆ ఇంటర్వ్యూలో ఎంత పచ్చిగా బోల్డ్ గా మాట్లాడుకున్నారు అప్పట్లో జనాలు. అది విని ఎంత షాక్ అయ్యారో.. ఎప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేం . కాగా ఆ తర్వాత పలు ఈవెంట్లతో షోలతో బిజీ బిజీగా ఉన్న అరియానా.. తాజాగా ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో నటించి మెప్పించింది. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది . అరియానా తన సొంతింటి కలను నిజం చేసుకుంటుంది . దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది .
దీంతో పలువురు జనాలు ఆమెకు కంగ్రాట్యులేషన్స్ అంటూ విషెస్ అందిస్తున్నారు. అంతేకాదు అరియానా ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడిందో అది అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా లేడీ టైగర్ అంటూ ఆమె ట్యాగ్ చేయించుకుని బిగ్ బాస్ లో హైలెట్ గా మారింది. మొత్తానికి ఫైనల్లీ అనుకున్నది సాధించింది అరియానా..చూద్దాం రానున్న రోజుల్లో అరియానా ఇంకెన్ని విజయాలు సాధిస్తుందో..??
View this post on Instagram