ఈసారి బిగ్ బాస్ లో కొత్త రూల్ ఏంటో తెలుసా..? భలే ట్విస్ట్ పెట్టాడే..!

బిగ్బాస్ ఇప్పటికే ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది . అంతేకాదు త్వరలోనే ఎనిమిదవ సీజన్ ప్రారంభం కాబోతుంది. కాగా ఇలాంటి క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల లిస్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి బడా బడా స్టార్స్ ని కూడా రంగంలోకి దించబోతున్నారు బిగ్బాస్ మేనేజ్మెంట్ అంటూ తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇద్దరు టాప్ సింగర్స్ తో పాటు ఒక విడాకులు తీసుకున్న జంటను సైతం హౌస్ లోకి పంపించబోతున్నారట. అంతేకాదు పలువురు యూట్యూబర్ లను కూడా హౌస్ లోకి పంపించబోతున్నట్లు సమాచారం అందుతుంది .

కాగా ఇలాంటి క్రమంలోనే బిగ్ బాస్ కొత్త రూల్స్ కూడా పెట్టబోతుందట. మరీ ముఖ్యంగా గతంలో బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు బయటకు రాబోతున్నారు అనే విషయాలు ఇట్టే మీడియాకు లీక్ అయిపోయేటివి .. ఈసారి ఆ పొరపాటు జరగకుండా ఏ కాంటెస్టెంట్ అయినా సరే ఎలిమినేట్ అయిన రెండు వారాల వరకు హౌస్ లో అలాగే సీక్రెట్ రూమ్ లో ఉంచుతారట. ఆ తర్వాత మళ్లీ టాప్ త్రీ కంటెస్టెంట్ల చేత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఎవరు హౌస్ లోకి రావాలి అనుకుంటున్నారో వాళ్లకు ఓట్లు వేయించి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ను ఎవరైతే వరస్ట్ పర్ఫామెన్స్ ఇస్తారు వాళ్లను బయటకు పంపించే విధంగా కొత్త టాస్క్ పెట్టబోతున్నారట.

దీంతో మరింత కాంట్రవర్షియల్ గా మారబోతుంది షో అంటున్నారు జనాలు . అసలకే అవసరం ఉన్నా లేకపోయినా కొట్టుకొని చస్తూ ఉంటారు కాంటెస్టెంట్లు.. మరి ఇలాంటి కన్నింగ్ ధీమ్ పెడితే ఇక కొట్టుకొని చావడమేముంది జుట్టులు పట్టుకొని అరుచుకోవడమే అంటూ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు .సోషల్ మీడియాలో ప్రజెంట్ బిగ్ బాస్ కి సంబంధించిన ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది..!!